చేతులు కాళ్లలో జలదరింపు వస్తుందా.. ఆ సమస్యకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!

ఈ మధ్య కాలంలో చాలామందిని ఎన్నో ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. బీపీ, షుగర్ వల్ల ఎంతోమంది ఆరోగ్యపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కాళ్లు, చేతులు జలదరించడం వల్ల కొంతమంది ఆరోగ్యపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. కొంతమందికి కాళ్ల మీద చీమలు పాకకపోయినా పాకినట్టు ఫీలింగ్ వస్తుంది. అయితే ఇలా జరగడం వెనుక అసలు కారణాలను వైద్యులు తాజాగా వెల్లడించారు.

మన శరీరానికి అత్యంత ముఖ్యమైన విటమిన్లలో బీ12 ఒకటి కాగా ఎవరైతే ఈ విటమిన్ లోపంతో బాధ పడుతూ ఉంటారో వాళ్లను కాళ్లు చేతులలో జలదరింపు సమస్య వేధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. విటమిన్-బి12 శరీరంలో నాడీ వ్యవస్థ పనితీరుకు సహరించే అవకాశాలు అయితే ఉంటాయి. విటమిన్-బి12 లోపించడం వల్ల నరాల పనితీరు మందగించే ఛాన్స్ అయితే ఉంది.

విటమిన్ బి12 లోపిస్తే శరీరంలోని వేర్వేరు అవయవాలకు ఆక్సిజన్, పోషకాలు సరఫరా కావడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ రీజన్ వల్లే కాళ్లు, చేతులలో జలదరింపులు మొదలయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమస్య వల్ల కొన్ని సందర్భాల్లో కాళ్లు చేతులు మొద్దుబారి పోయే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. విటమిన్ బీ12 ఉన్న ఆహారాలను తీసుకోవడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టే ఛాన్స్ ఉంటుంది.

విటమిన్-బి12 మాంసాహారంలో మాత్రమే కాకుండా శాకాహారంలో సైతం లభ్యం అవుతుంది. విటమిన్-బి12 చేపలలో పుష్కలంగా లభించే అవకాశాలు అయితే ఉంటాయి. గుడ్లు తినడం ద్వారా కూడా శరీరానికి అవసరమైన బీ12 లభించే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. పాలు, తృణధాన్యాలు, పెరుగు తీసుకోవడం ద్వారా విటమిన్ బీ12 లోపానికి చెక్ పెట్టే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.