మన దేశంలోని హిందువులు వినాయకుడిని ఎంతో ఇష్టంగా పూజిస్తారనే సంగతి తెలిసిందే. ఈ ఏడాది సెప్టెంబర్ నెల 18వ తేదీన కొంతమంది వినాయక చవితి పండుగను జరుపుకుంటుండగా సెప్టెంబర్ నెల 19వ తేదీన మరి కొందరు వినాయక చవితిని జరుపుకోనున్నారు. అయితే వినాయకుడిని పూజించే వాళ్లు వినాయకుడిని ఏ విధంగా పూజించలనే అవగాహనను సైతం కలిగి ఉంటే మంచిది.
కొత్తగా ఏ పనిని మొదలుపెట్టాలన్నా మనలో చాలామంది వినాయకుని పూజతో మొదలుపెడతారు. వినాయకుడిని పూజించడం ద్వారా చేపట్టే పనులలో ఎలాంటి విఘ్నాలు ఎదురు కావని చాలామంది ఫీలవుతారు. వినాయకచవితి రోజున ఉదయాన్నే నిద్ర లేచి తల స్నానం చేసి కొత్త దుస్తులను ధరించి తోరణాలతో ఇంటిని అలంకరించాలి. ఇంటికి ఈశాన్య భాగంలో పీటను ఉంచడంతో పాటు పల్లెంలో బియ్యం వేసి వాటిపై తమలపాకులు పెట్టుకుని దీపారాధన తర్వాత మంత్రాలను పఠిస్తూ పూజ చేయాలి.
ఓం దేవీంవాచ మజనయంత దేవాస్తాం విశ్వరూపా: పశవో వదంతి
సానో మంద్రేష మూర్జం దుహానాధే నుర్వాగాస్మానుప సుష్టుతైత్తు అయం ముహూర్తస్సుముహూర్తోస్తు.
శ్లోకం: య శ్శివో నామరూపాభ్యాం యా దేవీ సర్వ మంగళా తయో స్సంస్మరణా త్సుంసాం సర్వతో జయమంగళం
ఈ మంత్రం, శ్లోకం పఠించడం ద్వారా శుభ ఫలితాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. పీటపై వినాయక ప్రతిమను ఉంచి పాలవెల్లికి పసుపు రాసి పత్రి వేసి పూజించాలి. పిండివంటలను సిద్ధం చేసుకుని టెంకాయ కొట్టి పూజించాలి. నైవేద్యాలను సమకురుచుకుని ఓం కేశవాయ స్వాహాః, ఓం నారాయణాయ స్వాహాః, ఓం మాధవాయ స్వాహాః అనే మంత్రాన్ని మూడుసార్లు చదివితే మంచిది. వినాయకుడిని పూజించే సమయంలో గరిక కచ్చితంగా ఉండాలి.