పీఎం కిసాన్ స్కీమ్ బెనిఫిట్ పొందే వాళ్లకు భారీ షాక్.. ఆ ఖాతాల నుంచి డబ్బులు కట్!

మన దేశంలో పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా లక్షల సంఖ్యలో ప్రజలు బెనిఫిట్ పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ స్కీమ్ ద్వారా అర్హత పొందిన వాళ్లకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. ప్రతి నాలుగు నెలలకు 2,000 రూపాయల చొప్పున ఈ స్కీమ్ కు సంబంధించిన నగదు రైతుల ఖాతాలలో జమవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ స్కీమ్ అర్హులను కొంతమంది సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నారు.

తాజాగా ఒక రైతును టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు రైతు ఖాతా నుంచి ఏకంగా 4 లక్షల రూపాయలకు పైగా కొట్టేశారు. పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా అర్హత పొందుతున్న రైతులు ఈ విషయాలను గుర్తుంచుకుంటే మంచిది. గుర్తు తెలియని వ్యక్తులు ఈ కేవైసీ లేదా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అంటూ ఓటీపీ వివరాలను అడిగితే తగిన జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది.

పీఎం కిసాన్ స్కీమ్ 19వ విడత నగదు త్వరలో రైతుల ఖాతాలలో జమ కానుంది. పీఎం కిసాన్ స్కీమ్ వల్ల రైతులకు ఏడాదికి 6,000 రూపాయలు పెట్టుబడి సాయం పొందుతున్నారు. ఈ మొత్తం పెంచాలని రైతులు కోరుకుంటున్నా ప్రభుత్వం నుంచి సరైన రెస్పాన్స్ అయితే ఉండటం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

పీఎం కిసాన్ స్కీమ్ రైతులకు దీర్ఘకాలంలో ప్రయోజనం చేకూర్చే స్కీమ్ అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. పొలం ఉన్నా ఈ స్కీమ్ కు అర్హత పొందని రైతులు వెంటనే ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేయడం ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన బెనిఫిట్స్ ను పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.