గరుడ పురాణం ప్రకారం కొన్ని తప్పులు చేయకూడదు. శ్మశాన వాటిక పొగకు దూరంగా ఉండాలి, తప్పుడు సాక్ష్యాలు చెప్పకూడదు, మోసం చేయకూడదు, భార్య, పిల్లలను పట్టించుకోకపోవడం, పితృదేవతలను నిర్లక్ష్యం చేయకూడదు, నిస్సహాయుల పట్ల కనికరం లేకుండా ప్రవర్తించకూడదు, బలహీనులను శిక్షించకూడదు. మరణించిన వ్యక్తి మృత దేహాన్ని శ్మశాన వాటికలో దహనం చేసినప్పుడు వెలువడే పొగకు దూరంగా ఉండాలి.
తప్పుడు సాక్ష్యాలు చెప్పేవారు రెండో జన్మలో గుడ్డివాడుగా పుడతారని గరుడ పురాణం ప్రకారం లో వివరించబడింది. మోసం చేసే వారు వచ్చే జన్మలో గుడ్లగూబలుగా పుడతారని గరుడ పురాణం ప్రకారం లో వివరించబడింది. భార్యా పిల్లలను పట్టించుకోకపోవడం, వారిపై దౌర్జన్యానికి దిగడం కూడా నరకానికి దారి తీస్తాయి. పితృదేవతలను నిర్లక్ష్యం చేయడం కూడా నరకానికి దారి తీస్తుంది. నిస్సహాయుల పట్ల కనికరం లేకుండా ప్రవర్తించేవారు, బలహీనులను శిక్షించేవారు నేరుగా నరకానికి వెళ్తారు.
వివాహిత స్త్రీలు ఒంటరిగా ఎక్కడికీ వెళ్లకూడదని గరుడ పురాణం చెపుతోంది. ఇది వారి జీవితంపై నెగెటివ్ ఎనర్జీకి కారణమవుతుందని చెపుతున్నారు. గరుడ పురాణం ప్రకారం తప్పుడు చర్య చేస్తే కలిగే పరిణామాలు తెలిసినప్పటికీ తప్పు మార్గంలో ఉన్న వ్యక్తి పాపాలకు పాల్పడుతూనే ఉంటాడు. దక్షిణం లేదా పడమర దిశ వంటి తప్పు దిశలో తలపెట్టి నిద్రించడం వలన ఆయుష్షును తగ్గిస్తుందని గరుడ పురాణంలో చెప్పబడింది.
వివాహానికి సంబంధించిన అనేక విషయాలు గరుడ పురాణంలో పేర్కొన్నారు. వివాహం తర్వాత స్త్రీ కొన్ని తప్పులు చేస్తే, ఆమె వైవాహిక జీవితం నాశనం అవుతుందని చెబుతారు. గరుడ పురాణం ప్రకారం కొన్ని అలవాట్లు ఇంట్లో గొడవలను తీసుకువస్తాయి. ఆనందం, శ్రేయస్సు కలగాలంటే తప్పులు చేయకుండా జాగ్రత్త పడాలి. ఇక ఈ గరుడ పురాణం అనేది మనుషులు చేసేటువంటి కర్మలను గురించి క్లుప్తంగా చెబుతుంది.
