మీ పిల్లలకు వ్యాక్సిన్లు వేయిస్తున్నారా.. అస్సలు చెయ్యకూడని పొరపాట్లు ఏంటో తెలుసా?

చిన్నపిల్లల ఆరోగ్యం విషయంలో మనలో చాలామంది కచ్చితంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పిల్లలకు ఇచ్చే వ్యాక్సిన్ల విషయంలో తగిన జాగ్రత్తలు తప్పనిసరి అనే సంగతి తెలిసిందే. పిల్లలకు సరైన సమయంలో వ్యాక్సిన్లు వేయించని పక్షంలో దీర్ఘకాలంలో ఎదురయ్యే ఇబ్బందులు అన్నీఇన్నీ కావనే సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆస్పత్రులలో పిల్లల వయస్సుకు అనుగుణంగా వ్యాక్సిన్లను తీసుకుంటే మంచిది.

ఆ వ్యాక్సిన్లు పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచడంలో తోడ్పడతాయి. పిల్లల వయస్సుకు అనుగుణంగా నొప్పి లేని టీకాలు అందుబాటులోకి వస్తున్నాయి. వైద్యుల సూచనల ప్రకారం పిల్లలకు వ్యాక్సిన్లు వేయించని పక్షంలో దీర్ఘకాలంలో పిల్లలకు నష్టాలు కలుగుతాయి. పిల్లలకు వ్యాక్సిన్లు వేయించే సమయంలో వ్యాక్సిన్ కాలపరిమితిని చూసుకోవాలి.

పిల్లలకు అప్పటికే ఏవైనా వ్యాధులు సోకితే ఆ విషయాలకు సంబంధించిన సమాచారం ముందే ఇచ్చి వ్యాక్సిన్లు ఇచ్చేలా చేస్తే మంచిది. దీర్ఘకాలిక వ్యాధులకు చెక్ పెట్టడంలో వ్యాక్సిన్లు ఉపయోగపడతాయి. సమీపంలోని ఆశ కార్యకర్తలను, హెల్త్ అసిస్టెంట్లను సంప్రదించడం ద్వారా పిల్లలకు ఇవ్వాల్సిన వ్యాక్సిన్లకు సంబంధించి పూర్తిస్థాయి సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుంది.

పిల్లలకు పోలియో వ్యాక్సిన్ అత్యంత ముఖ్యమైన వ్యాక్సిన్ అని చెప్పవచ్చు. పిల్లలకు వ్యాక్సిన్లు వేయించడం ద్వారా అంటువ్యాధుల బారిన పడే అవకాశం కూడా తగ్గుతుంది. సమీపంలో ప్రభుత్వ ఆస్పత్రులు లేని వాళ్లు ప్రైవేట్ ఆస్పత్రులను సంప్రదించి వ్యాక్సిన్లు తీసుకోవచ్చు.