పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడుతున్నారా.. వీటిని ఎక్కువగా వాడితే అంతే సంగతులు!

మనలో చాలామంది తీసుకునే ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి ఏ మాత్రం ఇష్టపడటం లేదు. అజీర్తి వల్ల ఈ మధ్య కాలంలో చిన్నా, పెద్ద అనే తేడాల్లేకుండా అందరూ ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉన్న సంగతి తెలిసిందే. సమయానికి ఆహారం తీసుకోకపోయినా నూనెలు, కొవ్వుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకున్నా ఈ సమస్య బారిన పడే ఛాన్స్ ఉంటుంది.

అజీర్తి అనేది తీవ్రరూపం దాల్చినప్పుడు అల్సర్స్​గా మారే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. జీర్ణకోశంలోని పేగులో పూత లేదా పొట్టులా ఏర్పడడాన్ని అల్సర్స్​ అని వైద్యులు వెల్లడిస్తున్నారు. అల్సర్స్ అంతకంతకూ పెరిగితే మాత్రం ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు. జీవన విధానంలో మార్పు రావడం వల్ల ఎక్కువమంది ఈ సమస్య బారిన పడే అవకాశాలు అయితే ఉంటాయి.

హెచ్​ పైలోరి అనే బ్యాక్టీరియా వల్ల కూడా అల్సర్ల బారిన పడే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. కొన్నిసార్లు కలుషిత నీటిని తాగడం వల్ల కూడా ఈ సమస్య వేధిస్తుంది. పెయిన్​ కిల్లర్స్​ వాడే వారికీ అల్సర్స్​ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అల్సర్స్ తో బాధ పడేవాళ్లు ధూమపానానికి, మద్యపానానికి దూరంగా ఉండటంతో పాటు వ్యాయామం చేయడం, సమయానికి మందులు తీసుకోవడం చేయాలి.

ఆహారంలో ఎక్కువ మోతాదులో నూనెలు, కొవ్వులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటే అల్సర్స్ బారిన పడే ఛాన్స్ అయితే ఉండదని చెప్పవచ్చు. మరీ ఎక్కువగా నొప్పి ఉంటే మాత్రమే పెయిన్ కిల్లర్స్ ను ఉపయోగించాలని చిన్నచిన్న సమస్యలకు పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల నష్టమే తప్ప లాభం ఉండదని వైద్యులు చెబుతుండటం గమనార్హం.