యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. అసిస్టెంట్ డైరెక్టర్, సైంటిస్ట్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి సిద్ధమైంది. upsc.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 29వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. మొత్తం 67 పోస్ట్ లను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
అసిస్టెంట్ డైరెక్టర్ ఉద్యోగ ఖాళీలు 51 ఉండగా సైంటిస్ట్-బీ (ఫిజికల్-సివిల్)- ఒక పోస్ట్ ఉంది. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గ్రేడ్ 1 ఉద్యోగ ఖాళీలు 2 ఉండగా సైంటిస్ట్-బీ 9 ఉద్యోగ ఖాళీలు, స్పెషలిస్ట్ గ్రేడ్ iii 3 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. 40 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తోంది.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ఏరోనాటికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ విభాగాలతో పాటు సివిల్/మెకానికల్/కంప్యూటర్ సైన్స్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏరోడ్రోమ్ కంట్రోల్‌లో రెండేళ్ల అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. అధికారిక పోర్టల్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంటుందని చెప్పవచ్చు.
యూపీఎస్సీ రిక్రూట్‌మెంట్ 2024 లింక్ పై క్లిక్ చేయడం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం జరగనుంది. అర్హత ఉన్నవాళ్లు యూపీఎస్సీ ఉద్యోగ ఖాళీల కోసం వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు బెనిఫిట్ కలగనుంది.