ప్రముఖ బ్యాంక్ లలో ఒకటైన యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు చేయాలని భావించే వాళ్లకు తీపికబురు అందించింది. 1001 డేస్ స్పెషల్ స్కీమ్ ను యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అమలు చేస్తుండటం గమనార్హం. ఈ స్కీమ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే 9.5 శాతం వడ్డీ లభించే అవకాశం అయితే ఉంటుంది. కనీసం 10,000 రూపాయల నుంచి ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
1001 రోజుల మెచ్యూరిటీ పీరియడ్ పై 9 శాతం వడ్డీ లభిస్తుండగా 5 లక్షల రూపాయలు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే రూ.1,23,800 వడ్డీ రూపంలో లభించే అవకాశం అయితే ఉంటుంది. 1002 రోజుల తర్వాత డిపాజిట్ చేసే మొత్తంపై 8.15 శాతం వడ్డీ పొందే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. సీనియర్ సిటిజన్లు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే ఏకంగా 9.5 శాతం వడ్డీ పొందవచ్చు. సీనియర్ సిటిజన్లకు మరింత ఎక్కువ మొత్తం లభిస్తుంది.
మూడేళ్ల పాటు డిపాజిట్ చేయడం వల్ల 1,23,000 రూపాయలు వడ్డీ రూపంలో పొందడం అంటే సాధారణమైన విషయం కాదు. ఎక్కువ మొత్తంలో డిపాజిట్ చేయాలని భావించే వాళ్లు ఈ స్కీమ్స్ పై దృష్టి పెడితే మంచిది. సాధారణ బ్యాంకులతో పోల్చి చూస్తే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఎక్కువ మొత్తంలో వడ్డీ లభించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
సమీపంలోని యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ను సంప్రదించడం ద్వారా ఈ స్కీమ్ గురించి మరిన్ని విషయాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఎక్కువ మొత్తంలో డిపాజిట్ చేస్తే మరింత ఎక్కువ మొత్తం పొందే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతం చిన్న మొత్తాలలో పొదుపు చేయడం ద్వారా దీర్ఘకాలంలో ఎక్కువ మొత్తం పొందే ఛాన్స్ అయితే ఉంటుంది.