ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా ఎంతోమందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యలలో డయాబెటిస్ ఒకటని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. టైప్1 డయాబెటిస్ తో పోల్చి చూస్తే టైప్ 2 డయాబెటిస్ ఒకింత ప్రాణాపాయాన్ని కలిగిస్తుంది. డయాబెటిస్ సమస్యతో బాధ పడేవాళ్లు ప్రధానంగా కొన్ని లక్షణాలు కనిపిస్తే ఎంతో జాగ్రత్త పడాలి. ఈ జాగ్రత్తలు పాటించకపోతే చాలా నష్టం వస్తుంది.
డయాబెటిస్ తో బాధ పడేవాళ్లలో చాలామందిని అతి మూత్ర వ్యాధి వేధిస్తుంది. ఈ సమస్యకు వెంటనే వైద్యుల సలహాల ప్రకారం మందులు వాడాలి. ఈ సమస్య విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రాణాలకే ప్రమాదం కలిగే అవకాశం ఉంటుంది. షుగర్ సమస్యతో బాధ పడేవాళ్లలో చాలామందికి విపరీతమైన ఆకలి ఉంటుంది. ఈ సమస్య బారిన పడితే కూడా మందులు వాడాల్సి ఉంటుందని చెప్పవచ్చు.
డయాబెటిస్ సమస్యతో బాధ పడేవాళ్లకు విపరీతమైన దాహం సమస్య వేధిస్తుంది. అయితే కొంతమంది దాహం వేసినా నీళ్లు తాగకుండా ఉంటారు. అలా చేయడం వల్ల నష్టమేనని చెప్పవచ్చు. ఎన్నిసార్లు దాహమైనా వెంటనే నీళ్లు తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే కచ్చితంగా ఉండదని చెప్పవచ్చు. డయాబెటిస్ తో బాధ పడేవాళ్లకు గాయాలు త్వరగా తగ్గే అవకాశాలు అయితే ఉండవు.
డయాబెటిస్ వ్యాధిగ్రస్తులను కంటి సంబంధిత సమస్యలు వేధించే అవకాశాలు ఉంటాయి. షుగర్ సమస్యతో బాధ పడేవాళ్లకు గాయాలు వేగంగా మానే అవకాశాలు ఉండవు. షుగర్ సమస్యతో బాధ పడేవాళ్లకు చేతులు లేదా పాదాలలో తిమ్మిరి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. శరీరంలో తగినంత ఇన్సులిన్ లేని పక్షంలో అలసట సమస్య వేధించే అవకాశం అయితే ఉంటుంది.