మన దేశంలో బ్యాంక్ ఉద్యోగాల కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. అయితే బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్లకు బెనిఫిట్ కలిగేలా భారీ సంఖ్యలో జాబ్ నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. 13,000కు పైగా ఉద్యోగ ఖాళీల కోసం జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం గమనార్హం. 43 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో క్లర్క్, ఆఫీస్ అసిస్టెంట్, పీవో ఇతర ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ద్వారా బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూసే వాళ్లకు భారీ స్థాయిలో బెనిఫిట్ కలగనుంది. ఐబీపీఎస్ 9995 ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుండగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 3000 అప్రెంటిస్‌షిప్ పోస్టుల భర్తీ జరగనుందని సమాచారం అందుతోంది. రాత పరీక్ష ద్వారా అప్రెంటిస్‌షిప్‌కు ఎంపిక ప్రక్రియ జరగనుంది.
వేర్వేరు బ్యాంకులకు సంబంధించి జాబ్ నోటిఫికేషన్లు వెలువడిన నేపథ్యంలో అర్హతల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా బెనిఫిట్ కలగనుంది. బ్యాంక్ ఉద్యోగ ఖాళీల కోసం ఎదురు చూసేవాళ్లకు ఇది బంపర్ ఆఫర్ అవుతుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపించాయి.
ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు ఒకింత భారీ వేతనం లభించనుందని సమాచారం అందుతోంది. 23 నుండి 32 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. https://sbi.co.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. వరుస జాబ్ నోటిఫికేషన్స్ ద్వారా నిరుద్యోగులకు మేలు జరగనుంది.