కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ పీఎం విశ్వకర్మ స్కీమ్ పేరుతో ఒక స్కీమ్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక స్కీమ్ ద్వారా ఏకంగా రూ.3,15,000 పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ స్కీమ్ ద్వారా పొందే మొత్తం 3 లక్షల రూపాయలు రుణంగా పొందే ఛాన్స్ ఉండగా రూ.15,000 ఉచితంగా పొందే అవకాశాలు అయితే ఉంటాయి. ఉచితంగా వారం పాటూ ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు స్టైఫండ్ కూడా పొందే అవకాశం ఉంటుంది.
గతేడాది ఫిబ్రవరి 1 నుంచి ఈ స్కీమ్ అమలు కానుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ స్కీమ్ ద్వారా 13 లక్షల మంది బెనిఫిట్ పొందారని సమాచారం అందుతోంది. వృత్తిపనులు చేసేవాళ్లు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం 18 సంవత్సరాల వయస్సు దాటిన వాళ్లు ఈ స్కీమ్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. గత ఐదేళ్లలో ఇలాంటి ఇతర పథకాల్లో రుణం తీసుకొని ఉండని వాళ్లు ఈ స్కీమ్ కు అర్హులు.
ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లు 40 గంటల పాటు ఫ్రీ ట్రైనింగ్ పొందే అవకాశాలు ఉంటాయి. ఈ స్కీమ్ ద్వారా తీసుకున్న రుణంపై 5 శాతం వడ్డీ ఉంటుంది. లోన్ తీసుకున్న మొత్తాన్ని బట్టి టెన్యూర్ ఉంటుందని చెప్పవచ్చు. https://pmvishwakarma.gov.in/login స్కీమ్ ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
చేతివృత్తి పనులు చేసేవాళ్లకు పీఎం విశ్వకర్మ స్కీమ్ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. ఆధార్ నంబర్ ఇచ్చి రిజిస్ట్రేషన్ ఫారమ్ ను ఫిల్ చేయడం ద్వారా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ లో దరఖాస్తు చేసుకున్న వాళ్లు విశ్వకర్మ డిజిటల్ ఐడీ, సర్టిఫికెట్ పొందే అవకాశాలు ఉంటాయి.