నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు.. భారీ వేతనంతో ఆర్టీసీలో ఉద్యోగ ఖాళీలు!

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. రాష్ట్రంలోని వేర్వేరు ఆర్టీసీ డిపోలలో అప్రెంటిస్‌ శిక్షణ ఖాళీల భర్తీకి ఈ సంస్థ సిద్ధం కావడం గమనార్హం. http://tsrtc.telangana.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. మొత్తం 150 ఉద్యోగ ఖాళీలను ఈ శిక్షణ ద్వారా భర్తీ చేయనున్నారని తెలుస్తోంది.

ఈ ఉద్యోగాలలో హైదరాబాద్ రీజియన్‌ లో 26 ఉద్యోగ ఖాళీలు ఉండగా సికింద్రాబాద్ రీజియన్‌ లో 18, కరీంనగర్ రీజియన్ లో 15, మహబూబ్ నగర్ రీజియన్‌ లో 14, వరంగల్ రీజియన్‌ లో 14, రంగారెడ్డి రీజియన్‌ లో 12, మెదక్ రీజియన్‌ లో 12, నల్గొండ రీజియన్ లో 12, ఆదిలాబాద్ రీజియన్ లో 9, ఖమ్మం రీజియన్ లో 9, నిజామాబాద్ రీజియన్ లో 9 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

బీకాం, బీఎస్సీ, బీఏ, బీబీఏ, బీసీఏ కోర్సులలో ఉత్తీర్ణులైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అప్రెంటీస్ శిక్షణ వ్యవధి 3 సంవత్సరాలు కాగా ఈ శిక్షణకు ఎంపికైన వాళ్లకు ఏడాదికి 1000 రూపాయల చొప్పున వేతనం పెరుగుతుంది. విద్యార్హతలు, ధ్రువపత్రాల పరిశీలన, స్థానికత, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

www.nats.education.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఇతర వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. 2024 సంవత్సరం ఫిబ్రవరి 16వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మేలు చేకూరనుంది.