సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 107 ఉద్యోగ ఖాళీలతో తాజాగా జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. కోర్ మాస్టర్, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఎక్కువ సంఖ్యలో ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుండటంతో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.
ఈ ఉద్యోగ ఖాళీలలో కోర్ మాస్టర్ ఉద్యోగ ఖాళీలు 31 ఉండగా సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలు 33, పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలు 43 ఉన్నాయి. ఎక్కువ సంఖ్యలో ఉద్యోగ ఖాళీల భర్తీ వల్ల నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. డిగ్రీ విద్యార్హతతో పాటు నిమిషానికి 40 పదాలు టైప్ చేసే సామర్థ్యం ఉన్నవాళ్లు పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగానికి అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు.
కోర్ మాస్టర్ ఉద్యోగాలకు ఈ అర్హతలతో పాటు కనీసం ఐదేళ్ల అనుభవం ఉన్న వ్యక్తులు అర్హులని చెప్పవచ్చు. ఆన్లైన్ విధానం ద్వారా అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హత కలిగి ఉంటారు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 1000 రూపాయలు కాగా మిగతా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 250 రూపాయలుగా ఉంది.
రాతపరీక్ష, టైపింగ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు వెంటనే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది.