ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ద్వారా నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ టెలిమానస్ సెల్ లలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 76 పోస్టులను భర్తీ చేయనున్నారు. జూన్ నెల 18వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది. కన్సల్టెంట్ సైకియార్టిస్ట్ ఉద్యోగ ఖాళీలు 12, క్లినికల్ సైకాలజిస్ట్ 19, సైకియార్టిక్ సోషల్ వర్కర్ 6, కౌన్సిలర్ 36 ఉద్యోగ ఖాళీలు, టెక్నికల్ కో ఆర్డినేటర్ 1, డేటా ఎంట్రీ ఆపరేటర్ 2 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.
బీటెక్, బీఈ, డిగ్రీ, ఎంబీబీఎస్, పీజీ, డిప్లొమా, ఎంఫిల్, పీహెచ్డీ, ఎంస్, ఎండీ, ఎం.ఎం.డబ్ల్యూలో ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉన్నవాళ్లు అర్హులు అని చెప్పవచ్చు. 2025 సంవత్సరం జూన్ నెల 5వ తేదీ నాటికి 42 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 18,066 రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు వేతనం లభించనుంది.
ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. 2025 సంవత్సరం జూన్ నెల 7వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీగా ఉంది. 2025 సంవత్సరం జూన్ నెల 18వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అని చెప్పవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూఎం అభ్యర్థులకు 750 రూపాయలు దరఖాస్తు ఫీజుగా ఉంది.
ఓసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 1000 రూపాయలుగా ఉండనుంది. విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.