తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 2023 – 24 విద్యా సంవత్సరానికి సంబంధించి గెస్ట్ లెక్చరర్ల నియామకం కోసం ప్రభుత్వం నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. 1654 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం విడుదలైన ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా నిరుద్యోగులకు భారీ స్థాయిలో బెనిఫిట్ కలగనుంది. జులై 24వ తేదీ వరకు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి దరఖాస్తులను స్వీకరించనున్నారు.
జిల్ల పరిధిలోని సెలక్షన్ కమిటీ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇంటర్ విద్యా కార్యాలయాల ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని సమాచారం అందుతోంది. మార్కుల ఆధారంగా మొదట 1 : 3 పద్ధతిలో సెలక్షన్ కమిటీకి మెరిట్ లిస్ట్ ను పంపించడం జరుగుతుంది. ఎవరైతే ఈ ఉద్యోగాలకు ఎంపికవుతారో వాళ్లు ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో పాటు మూడు సెట్ల ఫోటో కాపీలతో హాజరు కావాల్సి ఉంటుంది.
గెస్ట్ ఫ్యాకల్టీకి ఎవరైతే ఎంపికవుతారో వాళ్లు ఈ విద్యా సంవత్సరం కోసం మాత్రమే పని చేస్తారని తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు పొందే ప్రయోజనాలను ఈ ఉద్యోగులు పొందలేరని సమాచారం అందుతోంది. అవసరాలకు అనుగుణంగా వీళ్లను పొడిగించడం లేదా తొలగించడం జరుగుతుందని తెలుస్తోంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరగనుంది.
ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు వేతనం భారీ రేంజ్ లోనే ఉండనుందని సమాచారం. ఈ ఉద్యోగాన్ని కాంట్రాక్ట్ ఉద్యోగంగా మాత్రమే పరిగణించాలి. ఈ ఉద్యోగంపై మాత్రమే ఆధారపడతామని భావించే వాళ్లకు మాత్రం ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది.
