రైలులో ప్రయాణం చేస్తున్నారా… ఈ విషయాలు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి… లేకపోతే చర్యలు తప్పవు!

అతిపెద్ద నెట్వర్క్ కలిగినటువంటి వాటిలో ఇండియన్ రైల్వే కూడా ఒకటి అని చెప్పాలి ప్రతిరోజు కొన్ని లక్షల మంది ప్రయాణికులు రైలు ప్రయాణం చేస్తూ వారి గమ్యాలకు చేరుకుంటున్నారు అయితే ఇలా రైలు ప్రయాణం చేసే ప్రయాణికులు తప్పనిసరిగా కొన్ని విషయాలను తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవాలని లేకపోతే చట్టపరమైన చర్యలు తప్పవంటూ అధికారులు తెలుపుతున్నారు.ఇప్పటికే ప్రయాణికుల కోసం ఎన్నో రకాల సేవలను ఇండియన్ రైల్వే అందుబాటులోకి తీసుకువచ్చింది ఈ క్రమంలోనే మనం రైళ్లలో ప్రయాణం చేసేటప్పుడు ఈ విషయాలు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.

ముందుగా మనం రైలు ప్రయాణం చేసేటప్పుడు సరైన టికెట్ మన దగ్గర ఉండేలా చూసుకోవాలి. టికెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకోవడం లేదా రైల్వే స్టేషన్లలోనూ మరియు అధికృత ట్రావెల్ ఏజెంట్ ద్వారా కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.చెల్లుబాటు కానటువంటి టికెట్టుతో ప్రయాణం చేయడం వల్ల ప్రయాణికుడు భారీ జరిమానా చెల్లించక తప్పదు. ఇక రైలు ప్రయాణం చేసే ప్రయాణికులకు పరిమితి కూడా ఉంటుంది. ఫస్ట్ ఏసి రెండవ ఏసీ కి 40 కేజీల పరిమితి లగేజ్ అనుమతి ఉంటుంది. మూడవ ఎసి చైర్ కారుకు 35 కేజీలు, స్లీపర్ క్లాస్కు 15 కేజీల లగేజీ తీసుకువెళ్లే అనుమతి ఉంటుంది.

ఇక రైళ్లలో ప్రయాణం చేసే ప్రయాణికులు ఇతరులకు ఇబ్బంది కలిగి విధంగా ధూమపానం మధ్యపానం చేయడం పూర్తిగా నిషేధం ఇలా చేసినచో తప్పనిసరిగా వారిపై చర్యలు తీసుకుంటారు కనుక ధూమపానం నిషేధం.ఇక మీరు ప్రయాణం చేస్తున్న సమయంలో అనుకోకుండా కొన్నిసార్లు మీ ప్రయాణం రద్దు అయితే మీరు బుక్ చేసిన టికెట్ను క్యాన్సిల్ చేసుకోవచ్చు.అయితే ఇలా ప్రయాణానికి ముందు కాకుండా కొన్ని గంటల ముందు మీ టికెట్ రద్దు చేసుకోవడం వల్ల మీరు టికెట్ కోసం చెల్లించిన డబ్బులు రైల్వే క్యాన్సిలేషన్ విధానం ప్రకారం మీ డబ్బు మీకు వాపస్ ఇవ్వబడుతుంది. ఇక రైలులో ప్రయాణించే వారు వారి లగేజ్ పట్ల వారే పూర్తి బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది.