ఎలాంటి రిస్క్ లేకుండా ఎక్కువ రాబడిని ఇచ్చే టాప్‌ ఎల్‌ఐసీ ప్లాన్స్‌ ఏంటంటే?

దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో పాలసీలను అమలు చేస్తుండగా ఆ పాలసీల వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతోమందికి ప్రయోజనం చేకూరనుంది. ఎల్‌ఐసీ పాలసీలలో న్యూ చిల్డ్రన్స్ మనీ-బ్యాక్‌ ప్లాన్‌ ఒకటి కాగా ఈ ప్లాన్ ద్వారా ఆర్థిక భద్రత లభించగా ఈ పాలసీ ద్వారా సర్వైవల్ బెనిఫిట్ తో పాటు డెత్, మెచ్యూరిటీ బెనిఫిట్ లభించడం జరుగుతుంది.

 

12 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ పాలసీ తీసుకోవడానికి అర్హత కలిగి ఉంటారని సమాచారం అందుతోంది. ఈ పాలసీ మెచ్యూరిటీ వయస్సు 25 సంవత్సరాలుగా ఉంటుంది. ఎల్‌ఐసీ న్యూ జీవన్ ఆనంద్ ప్లాన్ లో 18 నుంచి 50 సంవత్సరాల లోపు వయస్సు వాళ్లు చేరవచ్చు. 15 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు మెచ్యూరిటీ వయస్సు ఉంటుంది. లక్ష రూపాయల నుంచి ఎంత మొత్తమైనా ఈ పాలసీలో ఇన్వెస్ట్ చేయవచ్చు.

 

ఎల్‌ఐసీ పాలసీలలో జీవన్ ఉమంగ్ పాలసీ కూడా ఒకటి కాగా ఈ పాలసీ ద్వారా 100 సంవత్సరాల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. ఈ మూడు పాలసీలు కొత్తగా ఎల్‌ఐసీ పాలసీ తీసుకోవాలని భావించే వాళ్లకు బెస్ట్ పాలసీలుగా ఉంటాయి. సమీపంలోని ఎల్‌ఐసీ ఏజెంట్ లేదా బ్రాంచ్ ను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది.

 

ఎల్‌ఐసీ పాలసీల గురించి పూర్తిస్థాయిలో అవగాహన ఉంటే మాత్రమే ఈ పాలసీలలో పెట్టుబడులు పెడితే మంచిది. ఎల్‌ఐసీ అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరేలా వేర్వేరు పాలసీలను అందిస్తుండగా ఈ పాలసీల గురించి పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉంటే మాత్రమే ఈ పాలసీల బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది.