భార్య భర్తల మధ్య అనుబంధం 10 కాలాలపాటు ఎంతో బాగుండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అయితే ఈ బంధంలో కొన్ని మనస్పర్ధలు అలకలు కోపతాపాలు రావడం సర్వసాధారణం.ఇకపోతే ఇలాంటి మనస్కర్తలను అక్కడికే మర్చిపోతే వారి మధ్య ఉన్న బంధం 10 కాలాలపాటు ఎంతో అన్యోన్యంగా ఉంటారు అయితే భార్య భర్తల మధ్య బంధం అల్లుకుపోవాలంటే తప్పనిసరిగా కొన్ని విషయాలను భార్యాభర్తలు గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుందని ఆచార్య చానిక్యుడు తన నీతి గ్రంధం ద్వారా తెలియజేశారు.
ప్రేమ,అంకిత భావం,ఒకరిని ఒకరు గౌరవించుకోవడం,స్వార్థం ఉండకపోవడం ఈ నాలుగు సూత్రాలు అవసరం. ఏ బంధానికైనా ప్రేమ అవసరం అది లేకపోతే ఏ బంధం కూడా నిలబడలేదు. భార్యాభర్తల బంధం దీనికి అతీతం కాదు. దంపతులకి ఒకరిమీద ఒకరు ప్రేమ ఉండాలి. ఒకరు ప్రేమ చూపించి ఇంకొకరు ప్రేమ చూపించకపోతే కూడా బంధం నిలబడదు.ఇలా భార్య మీద భర్తకు భర్తపై భార్యకు ప్రేమను రాగాలు గౌరవ మర్యాదలు ఉండాలి అలాగే మనం ఏ పని చేసినా కూడా అంకితభావంతో పనిచేస్తూ ఒకరినొకరు గౌరవించుకున్నప్పుడే వారి బంధం బలపడుతుందని చాణిక్యుడు తెలిపారు.
భార్యాభర్తలు ఇద్దరు చేస్తున్న పనిని గౌరవించుకోవాలి కానీ నీకన్నా నేనే ఎక్కువ పని చేస్తున్నాను నా పనికి ప్రాధాన్యత ఉంది అనే విషయాల గురించి ఎప్పుడూ కూడా చర్చలకు రాకూడదు. అలా చేస్తే ఉన్న బంధం బీట్లు వారుతుంది. స్వార్థం ఇది చాలా చెడ్డది. భార్యాభర్తల విషయంలో ఇది ఇంకా చాలా ప్రమాదం. దంపతులు వారి గురించి మాత్రమే కాదు ఇద్దరి గురించి ఆలోచించాలి. ఇద్దరి గురించి ఆలోచిస్తే బంధం బలపడుతుంది ఇద్దరూ సంతోషంగా కూడా ఉంటారు. దంపతులు చాణుక్యుడు చెప్పిన సూత్రాలు పాటిస్తే సరిపోతుంది.