చిన్నపిల్లల్లో కడుపునొప్పికి అసలు కారణాలివే.. ఈ సమస్యకు చెక్ పెట్టే చిట్కాలివే!

ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలామంది చిన్నపిల్లలు కడుపునోప్పితో బాధ పడుతున్నారు. పిల్లల్లో చాలామంది చేతికి ఏది దొరికితే అది తింటూ ఉంటారు. కొన్ని సార్లు పాడైన ఆహారం, మరికొన్ని సార్లు అతిగా తినడం చేయడం వల్ల కూడా పిల్లలను ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం అయితే ఉంది. పిల్లలకు సరైన ఆహారపు అలవాట్లు లేకపోతే కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, గ్యాస్ లాంటి సమస్యలు వస్తాయి.

పిల్లలకు నిమ్మరసం కలిపిన నీరు ఇవ్వడం ద్వారా నిమ్మరసంలో ఉన్న ఆమ్లం ఆహారాన్ని విచ్చిన్నం చేయడంలో సహాయపడే అవకాశం ఉంటుంది. నిమ్మరసంలో తేనె కలిపి తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పవచ్చు. సొంపులో ఔషద గుణాలు ఎక్కువగా ఉండగా చెంచా సోపు గింజలు వేసి ఉడికించి ఫిల్టర్ చేసి గోరువెచ్చని నీటిని తాగితే మంచిది.

కడుపుకు చల్లదనం ఇవ్వడం ద్వారా కడుపు నొప్పి సమస్య దూరమయ్యే అవకాశం ఉంటుంది. కప్పు నీటిలో అల్లం ముక్కలు వేసి కాసేపు ఉడికించి ఫిల్టర్ చేసి తాగిస్తే కడుపునొప్పి దూరమవుతుంది. సెలెరీ నీరు పిల్లల కడుపు సంబంధ సమస్యలకు చెక్ పెట్టే అవకాశాలు అయితే ఉంటాయి. నీటిని వడగట్టి పిల్లలకు ఇవ్వడం ద్వారా హెల్త్ బెనిఫిట్స్ ను పొందే అవకాశాలు ఉంటాయి.

ఆహారం జీర్ణం కాకపోవడం, అతిగా తినడం, ఆకలి లేకపోయినా బలవంతంగా తినడం, మలబద్ధకం, ఇన్ఫెక్షన్లు, జంక్​ఫుడ్స్​, యూరిన్ ఇన్ఫెక్షన్, అపెండిసైటిస్ పిల్లల్లో కడుపునొప్పికి కారణమయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. తొందరగా జీర్ణం అయ్యే ఆహారం పిల్లలకు ఇస్తే పిల్లల ఆరోగ్యానికి మంచిది. కడుపు నొప్పి మరీ తీవ్రంగా ఉంటే మాత్రం వైద్యుల సలహాలు తీసుకోవాలి.