తక్కువ సమయంలో గ్యాస్ సిలిండర్ అయిపోతుందా.. కచ్చితంగా పాటించాల్సిన చిట్కాలివే!

gas

గత కొన్నేళ్లలో గ్యాస్ సిలిండర్ ధరలు ఊహించని స్థాయిలో పెరిగిపోయాయి. ప్రస్తుతం 14 కేజీల గ్యాస్ సిలిండర్ ను కొనుగోలు చేయాలంటే కనీసం 1300 రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను కొనుగోలు చేయాలంటే మాత్రం మరింత ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే తక్కువ సమయంలో గ్యాస్ అయిపోవడం వల్ల చాలామంది ఇబ్బందులు పడుతుంటారు.

ఒకవేళ గ్యాస్ తక్కువ సమయంలో అయిపోతుంటే కొన్ని చిట్కాలను పాటిస్తే మంచిది. చేయాల్సిన వంటకాల లిస్ట్ సిద్ధం చేసుకుని ఒకేసారి వంటలను సిద్ధం చేస్తే సులభంగా గ్యాస్ ను ఆదా చేయవచ్చు. టీ, కాఫీ, ఇతర వంటకాలను పదే పదే వేడి చేయకుండా ప్లాస్క్, వంటకాలను వేడిగా ఉంచే వస్తువులను ఉపయోగించడం ద్వారా గ్యాస్ సిలిండర్ ను ఆదా చేసే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

వంటలకు చిన్న బర్నర్ ను వినియోగిస్తే తక్కువ గ్యాస్ యూజ్ అవుతుంది. ఒకవేళ పెద్ద బర్నర్ ను వినియోగిస్తే మాత్రం ఎక్కువ గ్యాస్ యూజ్ అవుతుంది. బర్నర్లను తరచూ శుభ్రం చేసుకోవడంతో పాటు గ్యాస్ లీక్ కాకుండా చేసుకోవడం ద్వారా సిలిండర్ ను ఆదా చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ప్రెజర్ కుక్కర్ ను ఉపయోగించడం ద్వారా కూడా గ్యాస్ ఆదా అయ్యే అవకాశం ఉంది.

వంట చేసే సమయంలో పాత్రపై ప్లేట్ పెట్టడం ద్వారా గ్యాస్ ఆదా అయ్యేలా చేసుకోవచ్చు. గ్యాస్ వినియోగించే వాళ్లు తక్కువ మంటతో వంట చేయడం ద్వారా గ్యాస్ సేవ్ అవుతుంది. రెగ్యులేటర్, గ్యాస్ స్టవ్ పైప్ ను తరచూ చెక్ చేసుకోవడం ద్వారా గ్యాస్ ఆదా చేసుకోవచ్చు.