దేశంలో ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ కనెక్షన్ లేని ఇల్లు దాదాపుగా లేదనే సంగతి తెలిసిందే. మన దేశంలోని ఎక్కువ సంఖ్యలో ప్రజలు గ్యాస్ సిలిండర్ ద్వారా వంట చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే గ్యాస్ సిలిండర్ ను కొనుగోలు చేసి అర్హత ఉన్నవాళ్లు గ్యాస్ సబ్సిడీని పొందే అవకాశం అవకాశం అయితే ఉంటుంది. గ్యాస్ సిలిండర్ హోల్డర్లు కేవైసీ పూర్తి చేయడం ద్వారా గ్యాస్ సబ్సిడీని పొందవచ్చు. ఇప్పటివరకు కేవైసీ పూర్తి చేయని వాళ్లు వెంటనే పూర్తి చేస్తే మంచిది.
ఎవరైతే కేవైసీ పూర్తి చేయరో వాళ్లకు గ్యాస్ సబ్సిడీ ఆగిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో వెంటనే కేవైసీ అప్ డేట్ చేయించుకుంటే మంచిదని చెప్పవచ్చు. సమీపంలోని గ్యాస్ ఏజెన్సీని సంప్రదించడం ద్వారా ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. మార్చి 31వ తేదీ గ్యాస్ కేవైసీ అప్ డేట్ కు చివరి తేదీగా ఉందని తెలుస్తోంది. ఆ తేదీ దాటితే గ్యాస్ కేవైసీని అప్ డేట్ చేసుకోవడం కుదరదు.
ఆన్ లైన్ ద్వారా కూడా సులువుగా కేవైసీని పూర్తి చేసే అవకాశం ఉంటుంది. https://www.mylpg.in/ వెబ్ సైట్ ద్వారా కేవైసీని పూర్తి చేసే ఛాన్స్ ఉంటుందని చెప్పవచ్చు. గ్యాస్ కంపెనీని ఎంచుకుని కేవైసీ ఆప్షన్ ను ఎంచుకుని సరైన వివరాలతో పాటు వన్ టైమ్ పాస్ వర్డ్ ను ఎంటర్ చేయడం ద్వారా సులువుగా కేవైసీని పూర్తి చేసే అవకాశం ఉంటుంది. గ్యాస్ కనెక్షన్ ఉన్నవాళ్లు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.
ప్రస్తుతం గ్యాస్ సబ్సిడీ మొత్తం పరిమితంగానే జమవుతున్నా రాబోయే రోజుల్లో ఈ మొత్తం పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని తెలుస్తోంది. ప్రస్తుతం 40 నుంచి 50 రూపాయల రేంజ్ లో మాత్రమే గ్యాస్ సబ్సిడీ మొత్తం జమవుతోంది. గ్యాస్ సిలిండర్ ను కలిగి ఉన్నవాళ్లు ఈ విషయాలను
తప్పనిసరిగా గుర్తుంచుకుంటే మంచిది.