ఈ పని చేస్తే మాత్రమే గ్యాస్ సిలిండర్ పై సబ్సిడీ పొందే ఛాన్స్.. ఏం చేయాలంటే?

ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ లేని ఇల్లు దాదాపుగా లేదనే చెప్పాలి. నిరుపేదల నుంచి కోటీశ్వరుల వరకు ప్రతి ఒక్కరి ఇంట్లో గ్యాస్ సిలిండర్ తప్పనిసరి అయిందనే చెప్పాలి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ కింద 40.71 రూపాయల సబ్సిడీని అందిస్తోంది. ఉజ్వల స్కీమ్ లో భాగంగా గ్యాస్ సిలిండర్ తీసుకున్న వాళ్లు అదనంగా రాయితీ పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

అయితే గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పొందే వాళ్ల కోసం కొత్త నిబంధనలు అమలు కానున్నాయని సమాచారం అందుతోంది. ప్రస్తుతం 14.5 కేజీల గ్యాస్ సిలిండర్ ధర 855 రూపాయలుగా ఉంది. ప్రాంతాలను బట్టి ఈ గ్యాస్ సిలిండర్ ధరలో స్వల్పంగా మార్పులు చోటు చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఆదాయపు పన్ను చెల్లించే అర్హత లేని వాళ్ల బ్యాంక్ ఖాతాలలో మాత్రమే ఈ నగదు జమ అవుతోంది.

అయితే కొంతమంది ఆదాయపు పన్ను చెల్లించకపోయినా బ్యాంక్ ఖాతాలలో మాత్రం నగదు జమ కావడం లేదు. ఇలాంటి వాళ్లు జూన్ 1వ తేదీలోగా సమీపంలోని గ్యాస్ ఏజెన్సీని సంప్రదించి వేలిముద్ర వేస్తే సబ్సిడీ ధరకే గ్యాస్ సిలిండర్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని సమాచారం అందుతోంది. కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ నుంచి ఈ మేరకు ఆదేశాలు జారీ కావడం గమనార్హం.

ఎవరైతే కేవైసీ పూర్తి చేస్తారో వాళ్లు మాత్రమే ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందే అవకాశాలు అయితే ఉంటాయి. సబ్సిడీ పొందని వాళ్లు వెంటనే సమీపంలోని గ్యాస్ ఏజెన్సీని సంప్రదించడం ద్వారా పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. కేవైసీ పూర్తి చేయకపోతే మాత్రం కచ్చితంగా సబ్సిడీ పొందే ఛాన్స్ అయితే ఉండదని గుర్తుంచుకోవాలి.