ఈ పనులు చేస్తే బ్లడ్ షుగర్ పూర్తిస్థాయిలో కంట్రోల్ లో ఉంటుందట.. చిట్కాలు ఇవే!

ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్య అయింది. చిన్నపిల్లల్లో కూడా కొంతమంది ఈ సమస్య వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. భోజనానికి ముందు 300 గ్రాముల సలాడ్ తీసుకోవడం ద్వారా బ్లడ్ షుగర్ పూర్తిస్థాయిలో కంట్రోల్ లో ఉంటుందని సమాచారం అందుతోంది. వయస్సును బట్టి రక్తంలో ఉండాల్సిన షుగర్ లెవెల్స్ విషయంలో కూడా మార్పులు ఉంటాయి.

డైట్‌లో మార్పులు చేయడం ద్వారా మధుమేహాన్ని కంట్రోల్ చేయడం సాధ్యమవుతుంది. రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగడం వల్ల టెన్షన్, తలనొప్పి, అస్పష్టమైన దృష్టి, బరువు తగ్గడం ఇతర ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు ఉంటాయి. ఈ లక్షణాలు కనిపిస్తున్నా వైద్య పరీక్షలు చేయించుకుంటే మంచిది. మధుమేహంతో దీర్ఘకాలం పాటు బాధ పడే వారిలో గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, కిడ్నీ ఫెయిల్యూర్, మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ లాంటి సమస్యలు ఉంటాయి.

పూర్తి స్థాయిలో ఆహారపు అలవాట్లను మార్చుకుంటే మాత్రమే బ్లడ్ షుగర్ పూర్తిస్థాయిలో కంట్రోల్ లో ఉంటుందని చెప్పవచ్చు. సరైన లైఫ్ స్టైల్ లేకపోవడం, ఒత్తిడి, అధిక బరువు వంటి ఇతర కారణాల వల్ల మధుమేహం సమస్య వేధించే అవకాశాలు అయితే ఉంటాయి. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న ఫుడ్‌ని తీసుకోవడం ద్వారా షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయని భోగట్టా.

బార్లీ, పెసర్లు, రెడ్ రైస్ తీసుకోవడం ద్వారా షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. ఈ చిట్కాలు పాటించినా బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రో కాకపోతే వైద్యులను సంప్రదించి వైద్యుల సలహాలు, సూచనలు తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు.