జుట్టు రాలిపోతోందా..? బట్టతల సూచనలా..? ఈ ఫుడ్ తప్పనిసరి..!!

మనిషికి అందం, రికగ్నిషన్ తీసుకొచ్చే విషయంలో జుట్టు ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అందుకే కేశ సౌందర్యంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతూంటాం. కొబ్బరినూనె, జెల్, క్రీమ్స్, హెన్నా.. ఇలా జుట్టు కోసం రకరకాల ప్రయోగాలు చేస్తూ జుట్టును కాపాడుకుంటాం. జుట్టు ఊడుతున్నా.. కనీసం ఒక్క వెంట్రుక ఊడినా మనలో భయం, నిర్వేదం వచ్చేస్తూ ఉంటాయి. నిజానికి రోజుకు వంద వెంట్రుకలు ఊడినా పర్లేదు.. మళ్లీ వస్తాయని డాక్టర్లు అంటూంటారు. కానీ.. ప్రస్తుత పరిస్థితుల్లో మనిషి జీవనశైలి, ఒత్తిడి, పరిస్థితులు జుట్టుపై ఎక్కువ ప్రభావం చూపిస్తోంది.

దీంతో జుట్టు ఊడుతుంటే ఆందోళన సహజమైపోయింది. ముఖ్యంగా 30 ఏళ్ల యువతీ యువకుల్లో కూడా ఈ సమస్య వచ్చేస్తోంది. పరిస్థితుల ప్రభావం ఒకటైతే.. వారసత్వంగా కొందరిలో.. బ్యాక్టీరియా, వైరస్ ఇన్‌ఫెక్షన్‌లు, ఒత్తిడి, నిద్ర, ఆహారపు అలవాట్ల సమస్యల వల్ల కూడా చిన్న వయసులోనే జుట్టు రాలడం జరుగుతోంది. అయితే.. కొన్ని ఆహార నియమాలు పాటిస్తూ.. క్రమ పద్ధతిలో ఆహార పదార్థాలను తింటే హెయిర్ లాస్‌ సమస్యకు చెక్ పెట్టొచ్చని నిపుణులు అంటున్నారు. అవేమిటో చూద్దాం.

  • బాదం పప్పు రోజుకు నాలుగు తీసుకోవాలి. నీటిలో నానబెట్టి పైన తొక్క తీసి తినడం వల్ల ఉపయోగం ఉంటుంది. ఇందులోని బయోటిన్, మాగ్నీషియమ్ ఎక్కువగా ఉండటం వల్ల రెగ్యులర్ గా తినడం వల్ల జుట్టు బలంగా మారుతుంది.
  • ఓట్స్‌లో ఫైబర్, జింక్, ఒమెగా 6 ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్ బీ ఎక్కువగా ఉంటాయి. వీటిని కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఓట్స్‌ జుట్టు రాలే సమస్యకు చక్కటి పరిష్కారం చూపుతుంది.
  • వాల్‌నట్స్‌ కూడా ఎక్కువగా తినొచ్చు. ఇందులో ఉండే ఒమెగా ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్ బీ7 జుట్టు కుదుళ్లను బలంగా మార్చుతాయి. కొత్తగా జుట్టు పెరిగేందుకు దోహదం చేస్తుంది.
  • గుడ్లు, పాల ఉత్పత్తుల్లో ఉండే విటమిన్ బీ7 ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది. బట్టతల సూచనలు కనిపిస్తే ఆహారంలో పాలు, పెరుగు, వెన్న, గుడ్లు ఎక్కువగా తీసుకోవాలి. ఇవన్నీ క్రమం తప్పకుండా తీసుకుంటే జుట్టు రాలడం తగ్గుతుంది. ఒత్తైన జుట్టు ఉంటుంది.

 

గమనిక: ఈ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. పలు సందర్బాల్లో వైద్యులు, నిపుణలు వెలిబుచ్చిన వివరాలనే ఇక్కడ అందించాం. నిపుణులు, వైద్యుల అభిప్రాయాలకు ప్రత్యామ్నాయం కాదు. మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నా వైద్యులు, ఆరోగ్య నిపుణులను సంప్రదించి సలహాలు తీసుకోవడమే ఉత్తమం. మీ ఆరోగ్యం విషయంలో ‘తెలుగు రాజ్యం’ ఎటువంటి బాధ్యత వహించదు. గమనించగలరు.