కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తుండగా కేంద్రం అమలు చేస్తున్న పథకాలలో పశు కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ కూడా ఒకటి కావడం గమనార్హం. ఈ స్కీమ్ ద్వారా ఏకంగా 1,62,000 రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. పశు పోషణపై ఆధారపడ్డ మహిళలకు ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్ కలగనుంది.
ఇప్పటికే పాడి రంగంపై ఆధారపడిన వాళ్లు ఈ స్కీమ్ పై దృష్టి పెడితే మంచిది. ప్రాంతీయ పశువైద్య కార్యాలయం ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. మండలానికి 300 మంది ఈ స్కీమ్ ద్వారా అర్హత పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఈ స్కీమ్ ద్వారా పొందిన రుణాన్ని చెల్లించే సమయం ఆధారంగా వడ్డీ రేటు ఆధారపడి ఉంటుంది.
ఈ స్కీమ్ ద్వారా పొందిన రుణానికి 7 శాతం వడ్డీ కాగా అందులో 4 శాతం వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. మిగతా 3 శాతం వడ్డీ మాత్రం ప్రభుత్వం భరించే అవకాశాలు అయితే ఉంటాయి. ఎవరికైతే పశువులు ఉంటాయో వాళ్లు మాత్రమే ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పశువుల దాణా, షెడ్, ఇతర అవసరాల కోసం ఈ రుణాన్ని వినియోగించవచ్చు.
కేంద్రం అమలు చేస్తున్న బెస్ట్ స్కీమ్స్ లో ఈ స్కీమ్ ఒకటని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఈ స్కీమ్ గురించి సమీపంలోని బ్యాంక్ లను సంప్రదించడం ద్వారా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. పాడి మహిళలు ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుని రుణం తీసుకుంటే మంచిది.