విద్యార్థులకు అదిరిపోయే తీపికబురు.. ఆ స్కీమ్ ద్వారా ఏకంగా లక్షన్నర స్కాలర్ షిప్ పొందే ఛాన్స్!

మన దేశంలోని లక్షల సంఖ్యలో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా కేంద్ర ప్రభుత్వం ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో విద్యార్థులకు మేలు జరిగేలా కేంద్రం కొత్త స్కీమ్స్ దిశగా అడుగులు వేస్తోంది. పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్‌షిప్ అవార్డ్ స్కీమ్ ఫర్ వైబ్రెంట్ ఇండియా పేరుతో భారత ప్రభుత్వం ఒక స్కాలర్ షిప్ ను అమలు చేస్తుండటం గమనార్హం.

ఈ స్కాలర్ షిప్ ను పీఎం యశస్వీ స్కాలర్ షిప్ స్కీమ్ అని కూడా పిలుస్తారు. ఎవరైతే ఈ స్కీమ్ లో జాయిన్ అవుతారో వాళ్లలో 9, 10వ తరగతి విద్యార్థులకు 75 వేల రూపాయల ఆర్థిక సహాయం లభించనుండగా ఇంటర్ విద్యార్థులకు సంవత్సరానికి లక్షన్నర రూపాయల ఆర్థిక సహాయం లభించనుంది. ఈ ఏడాది మెరిట్ ఆధారంగా స్కాలర్ షిప్ కోసం స్టూడెంట్స్ ను ఎంపిక చేయడం జరిగింది.

https://yet.nta.ac.in/ వెబ్ సైట్ ద్వారా ఈ స్కాలర్ షిప్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. కుటుంబ వార్షికాదాయం 2.5 లక్షల రూపాయల లోపు ఉన్నవాళ్లు ఈ స్కాలర్ షిప్ కు అర్హత కలిగి ఉంటారు. సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్ మెంట్ వెబ్ సైట్ ద్వారా ఈ స్కాలర్ షిప్ కొరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

దరఖాస్తు ఫారమ్ ను పూర్తి చేసి అవసరమైన అన్ని పత్రాలను సబ్మిట్ చేయడం ద్వారా సులువుగా దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత ఉన్నవాళ్లకు ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనం చేకూరనుంది.