కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ విద్యార్థులలో ప్రతిభను ప్రోత్సహించే ఏ అవకాశం ఉన్నా ఆ అవకాశాన్ని వదులుకోవడానికి ఇష్టపడదు. సృజనాత్మక ఆలోచనలను ఆవిష్కరణల వైపు ప్రోత్సహించేందుకు మోదీ సర్కార్ అడుగులు వేస్తుండటంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. కేంద్ర ప్రభుత్వం విద్యార్థి విజ్ఞాన్ మంథన్ పేరుతో ప్రతిభాన్వేషణ్ పరీక్ష నిర్వహిస్తుండటం గమనార్హం.
ఇప్పటికే ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మొదలు కాగా ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. స్టేట్ బోర్డు, సీబీఎస్ఈ, ఎన్సీ ఈఆర్టీ సిలబస్ చదువుతున్న వాళ్లు ఈ పరీక్షకు హాజరు కావడానికి అర్హత కలిగి ఉంటారని సమాచారం అందుతోంది.
ఎవరైతే ఇందులో ప్రతిభ కనబరుస్తారో వాళ్లు కేంద్రం నుంచి స్కాలర్ షిప్ పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు జూనియర్ గ్రూప్ గా మిగతా విద్యార్థులకు సైతం గ్రూపుగా పరీక్ష నిర్వహిస్తారు. విద్యార్థుల ఆసక్తిని బట్టి వారికి నచ్చిన భాషలో పరీక్ష రాసే అవకాశం ఉంటుంది.
ప్రతిభ చూపిన మొదటి 20 మందిని తరగతుల వారీగా ఎంపిక చేయడం జరుగుతుంది. జాతీయ స్థాయి విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతిగా వరుసగా రూ.25 వేలు, రూ.15 వేలు, రూ.10 వేలు పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. విద్యార్థి విజ్ఞాన్ మంథన్ విజేతలుగా నిలిచిన విద్యార్థులకు మెమెంటో, ప్రశంసాపత్రం అందజేయడం జరుగుతుంది.