చదువుకునే విద్యార్థులకు ప్రయోజనం చేకూరే విధంగా తాజాగా అదిరిపోయే ప్రకటన వెలువడగా ఆ ప్రకటన నెట్టింట వైరల్ అవుతోంది. 8వ తరగతి చదివే విద్యార్థులకు మెరిట్ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే లభించింది. సెప్టెంబర్ నెల 6వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. అర్హత ఉన్నవాళ్లు ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
గుర్తింపు పొందిన పాఠశాలలో చదువుకోవడానికి వసతులు లేని విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు 7వ తరగతి మార్కు షీట్ ను సబ్మిట్ చేయడం ద్వారా ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ స్కాలర్ షిప్ కు సెప్టెంబర్ నెల 6వ తేదీ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుందని తెలుస్తోంది.
సంబంధిత వెబ్ సైట్ ద్వారా ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, ఎంపీయూపీ, వసతి సౌకర్యంలేని ఆదర్శ పాఠశాలల్లో ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ కు అర్హత కలిగి ఉంటారని సమాచారం అందుతోంది. జనరల్, బీసీ విద్యార్థులకు రూ.100, ఎస్సీ,ఎస్టీ విద్యార్థులకు రూ.50 దరఖాస్తు ఫీజుగా ఉంటుంది.
సమీపంలోని డీఈవో కార్యాలయంలో సంప్రదించడం ద్వారా ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే కచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు. ఎస్బీఐ కలెక్ట్ లింక్ ద్వారా పరీక్ష ఫీజును చెల్లించే అవకాశం అయితే ఉంటుంది. స్టూడెంట్స్ కు ప్రయోజనం చేకూరే విధంగా స్కాలర్ షిప్ స్కీమ్స్ ఉండటం కొసమెరుపు.