రూ.50 లక్షల రిటర్న్స్ కావాలా? ఎల్ఐసీ అద్భుతమైన బెస్ట్ పాలసీ ఇదే!

మనలో చాలామందికి ఎల్ఐసీ పాలసీల గురించి ఎన్నో అపోహలు ఉంటాయి. ఈ పాలసీల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా భారీ స్థాయిలోనే బెనిఫిట్ కలుగుతుంది. అయితే ఎక్కువ మొత్తం బెనిఫిట్స్ పొందాలంటే మాత్రం ఎక్కువ మొత్తం ప్రీమియంలను చెల్లించాల్సి ఉంటుంది. ఎల్ఐసీ బీమా రత్న పాలసీ ద్వారా కచ్చితంగా 50 లక్షల రూపాయల రిటర్న్స్ ను పాలసీదారులు సులువుగా పొందవచ్చు.

సేవింగ్స్ లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్ పాలసీ అయిన ఈ పాలసీ నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్ పర్సనల్ పాలసీ కావడం గమనార్హం. ఇన్వెస్ట్ మెంట్ తో పోల్చి చూస్తే పది రెట్లు ఎక్కువ మొత్తం ఈ పాలసీ ద్వారా పొందవచ్చు. ప్రీమియం చెల్లిస్తున్న వ్యక్తి ఏదైనా కారణం చేత మరణిస్తే వాళ్ల కుటుంబ సభ్యులు ప్రీమియం బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

2022 సంవత్సరం మే నెల నుంచి ఈ పాలసీ అమలవుతుండగా ఎక్కువమంది ఈ పాలసీ తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఎంచుకున్న టర్మ్ తో పోల్చి చూస్తే నాలుగేళ్లు తక్కువగా ప్రీమియంను చెల్లించాల్సి ఉంటుంది. 30 ఏళ్ల వ్యక్తి ఈ పాలసీ తీసుకుంటే మెచ్యూరిటీ సమయంలో 50 లక్షల రూపాయలు వస్తాయి. మనీబ్యాక్ కావాలని భావించే వాళ్లకు ఈ పాలసీ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు.

మనీ బ్యాక్ పాలసీల వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో బెనిఫిట్ కలుగుతుంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలనే ఆలోచనతో మనీ బ్యాక్ పాలసీలను అమలు చేస్తోంది. ఈ పాలసీల గురించి పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉంటే పాలసీ బెనిఫిట్స్ ను సులువుగా పొందవచ్చు.