కాలిన గాయాల వల్ల ఇబ్బందులు పడుతున్నారా.. సులువుగా చెక్ పెట్టే అద్భుతమైన చిట్కాలు ఇవే!

మనలో చాలామందికి ఏదో ఒక సందర్భంలో గాయాల వల్ల చర్మం కాలడం జరుగుతుంది. కాలిన గాయాల వల్ల కొత్త సమస్యలు సైతం ఎదురయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ గాయాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చీము పట్టే అవకాశం కూడా ఉంటుంది. కాలిన గాయాలకు కొబ్బరినూనె రాస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి. పసుపు వాడటం వల్ల కాలిన గాయాలు త్వరగా మానే అవకాశాలు అయితే ఉంటాయి.

పెరుగులో పసుపు వేసి గాయంపై రాయడం వల్ల గాయం తక్కువ సమయంలోనే మానే ఛాన్స్ అయితే ఉంటుంది. గాయాన్ని టిష్యూతో తడి లేకుండా తుడిచి టూత్ పేస్ట్ ను రాయడం ద్వారా గాయం త్వరగా మానుతుంది. పుదీనా ఫ్లేవర్ తో వచ్చే పేస్ట్ లను ఉపయోగిస్తే మరింత మెరుగైన ఫలితాలు ఉంటాయి. వైట్ వెనిగర్ ను గాయాలపై అప్లై చేయడం వల్ల కూడా అనుకూల ఫలితాలను పొందవచ్చు.

కాలిన గాయాలకు ఎన్ని చిట్కాలు ట్రై చేసినా ఫలితం లేకపోతే మాత్రం వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకుంటే మంచిది. కొన్నిసార్లు కాలిన చర్మానికి సర్జరీలు కూడా అవసరం అవుతాయి. సకాలంలో వైద్య చికిత్స చేయించుకోకపోవడం వల్ల కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. కాలిన గాయాలు తగ్గేవరకు వాటి విషయంలో మరిన్ని జాగ్రత్తలు అవసరమని చెప్పవచ్చు.

బొబ్బలు, మచ్చలు ఏర్పడటం వల్ల కొన్నిసార్లు మరింత నష్టం కలుగుతుంది. యాంటీ బయోటిక్ ట్యాబ్లెట్లను వాడటం వల్ల కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. ట్యాబ్లెట్లు వాడినా ఫలితం లేకపోతే చర్మవ్యాధి నిపుణులను సంప్రదించడం ద్వారా మెరుగైన ఫలితాలను పొందే ఛాన్స్ అయితే ఉంటుంది.