ఆధార్ కార్డ్ ఉన్నవాళ్లకు ప్రయోజనం చేకూరే విధంగా ఎన్నో స్కీమ్స్ అమలవుతున్న సంగతి తెలిసిందే. ఏ స్కీమ్ కు అర్హత పొందాలన్నా ఆధార్ కార్డ్ ను కచ్చితంగా కలిగి ఉండాలి. అయితే ప్రతి ఐదు లేదా పది సంవత్సరాలకు ఒకసారి ఆధార్ కార్డ్ ను అప్ డేట్ చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఆధార్ కార్డ్ ఉన్నవాళ్లు కచ్చితంగా కొన్ని విషయాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ లో ఉన్న వివరాలను కచ్చితంగా చెక్ చేసి పుట్టినరోజు, అడ్రస్ ఇతర వివరాలు తప్పుగా నమోదై ఉంటే వాటిని మార్చుకోవాలి.
అయితే ఆధార్ కార్డ్ అప్ డేట్ చేసుకోవాలంటే ఆధార్ కేంద్రానికి వెళ్లి మాత్రమే మార్చుకోవడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. అయితే అంగన్ వాడీ కేంద్రాలు, గ్రామ వార్డ్ సచివాలయ కేంద్రాల ద్వారా సైతం ఆధార్ కార్డ్ ను అప్ డేట్ చేసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోంది. ఆన్ లైన్ లో సైతం ఆధార్ అప్ డేట్ చేసుకునే ఛాన్స్ ఉన్నా కొన్ని సేవలకు మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉంది.
ఆధార్ కార్డ్ లో వివరాలు తప్పుగా ఉన్నవాళ్లు ఈ నెల 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు స్కూళ్లు, కాలేజీలు, సచివాలయాల సెంటర్లలో ప్రభుత్వం నిర్వహించే ఆధార్ క్యాంప్ లలో పాల్గొనడం ద్వారా ఆధార్ లో వివరాలు ఏమైనా తప్పుగా నమోదై ఉంటే వాటిని సులువుగా ఛేంజ్ చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఐదేళ్లు దాటిన పిల్లలు సైతం ఆధార్ కార్డ్ ను అప్ డేట్ చేసుకుంటే మంచిది.
ఆధార్ కార్డ్ కు లింక్ అయిన మొబైల్ నంబర్ మారితే కొత్త మొబైల్ నంబర్ ను సైతం సులువుగా మార్చుకునే అవకాశాలు అయితే ఉంటాయి. ఆధార్ కార్డ్ ను తరచూ వాడేవాళ్లు ఈ విషయాలను గుర్తుంచుకుంటే మంచిది. ఆధార్ కార్డ్ లేకపోతే మాత్రం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోక తప్పదని చెప్పవచ్చు.