ఈ మధ్య కాలంలో కల్తీ పెట్రోల్ కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. కల్తీ పెట్రోల్ వల్ల వాహనాలకు సరైన మైలేజీ రావడం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. పెట్రోల్ కల్తీ అయిందని అనుమానం వస్తే ఫిల్టర్ పేపర్ సహాయంతో కల్తీ నిజంగా జరిగిందో లేదో తెలుసుకోవచ్చు. ఫిల్టర్ పేపర్ పై ఎలాంటి మచ్చలు ఏర్పడకపోతే ఆ పెట్రోల్ స్వచ్చమైన పెట్రోల్ అని చెప్పవచ్చు.
పెద్దపెద్ద పరికరాలు అవసరం లేకుండానే ఈ విధంగా సులువుగా కల్తీ పెట్రోల్ ను గుర్తించే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. కల్తీ పెట్రోల్ వల్ల ఇంజిన్ కు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుందని చెప్పవచ్చు. ఫిల్టర్ పేపర్ అందుబాటులో లేకపోతే ఏ4 పేపర్ సహాయంతో కూడా కల్తీ పెట్రోల్ ను గుర్తించే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
కొన్ని పెట్రోల్ బంకులలో పెట్రోల్ కల్తీ జరగకపోయినా తక్కువ పెట్రోల్ పోసే ఆస్కారం అయితే ఉంటుంది. పెట్రోల్ ను ఎప్పుడూ ఒకే బంకులో కాకుండా వేర్వేరు బంకులలో పోయించడం ద్వారా పెట్రోల్ కు సంబంధించి ఏవైనా మోసాలు జరిగినా సులువుగా తెలిసే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. పెట్రోల్ విషయంలో కల్తీ జరిగినట్టు గుర్తిస్తే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు.
పెట్రోల్ ధరలు కూడా బంకులను బట్టి స్వల్పంగా మారతాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. బైక్ లను ఎక్కువగా వినియోగించే వాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. పెట్రోల్ కల్తీ జరిగి ఇంజిన్ పాడైతే మాత్రం ఎక్కువ మొత్తం డబ్బును ఖర్చు చేయాల్సి ఉంటుంది.