వాస్తు దోషం ఉన్న ఇంట్లో నివశిస్తే ఇన్ని సమస్యలా.. వాస్తు దోషాలను ఎలా గుర్తించాలంటే?

మనలో చాలామంది ఇంట్లో వాస్తు దోషం ఉండటం వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. శారీరక, మానసిక సమస్యలు తరచూ వేధిస్తుంటే మాత్రం ఆ సమస్యలకు వాస్తు దోషాలు కారణమయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. మనం ఎంత కష్టపడినా ఆశించిన ఫలితాలు రాకపోతే వాస్తు దోషాలు కారణమయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. వాస్తు శాస్త్ర ప్రకారం ఏ దోషం లేకపోయినా తరచూ ఇబ్బందులు ఎదురవుతుంటే మాత్రం జాగ్రత్త పడక తప్పదు.

కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతున్నా పిల్లలు పుట్టకపోయినా, లేనిపోని సమస్యలు వస్తున్నా వాస్తు దోషాలు కారణమయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఎంత ప్రయత్నించినా అప్పులు తీర్చలేకపోవడం, కొత్త అప్పులు చేయాల్సి రావడం కూడా వాస్తు సమస్యలకు కారణమవుతుందని చెప్పవచ్చు. ఇంట్లో పెంచుకుంటున్న కుక్క ఒకే దిక్కువైపు చూసి అరుస్తున్నా వాస్తు దోషాలు కారణమయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది.

అనుభవజ్ఞులైన జ్యోతిష్య, వాస్తు పండితులకు చూపించడం ద్వారా చిన్నచిన్న సమస్యలు ఉంటే ఆ సమస్యలను పరిష్కరించుకోవడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. యజమాని జన్మ నక్షత్రాన్ని బట్టి ఇంటికి సింహ ద్వారాలు ఎక్కడ ఉండాలో నిర్ణయించుకోవాలి. పితృ, సర్ప, దేవతా, ఋషి శాపాలు ఉన్న ఇంట్లో కూడా అనుకున్న ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే ఉండవు.

వాస్తుతో పాటు మన ప్రవర్తన కూడా బాగుంటే మంచి ఫలితాలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. మనకు అన్ని రకాలుగా సుఖాలిచ్చేది ఇల్లు కాగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వాస్తు సమస్యల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకునే అవకాశం ఉంటుంది.