సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ వల్ల ఆడపిల్లలకు ఎంతో లాభమనే సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులు ఆడ పిల్లల విద్య, పెళ్లి అవసరాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. తక్కువ పెట్టుబడితో దీర్ఘకాలంలో మంచి లాభాలను సొంతం చేసుకోవాలని భావించే వాళ్లు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది. ప్రతి నెలా తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎంతో ప్రయోజనం చేకూరనుంది.
ఆడపిల్లల తల్లిదండ్రులు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులను మెచ్యూరిటీ పీరియడ్ కు ముందు విత్ డ్రా చేసుకోవడం మాత్రం సాధ్యం కాదని చెప్పవచ్చు. ఆడపిల్లకు 10 సంవత్సరాల లోపు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కనీసం 15 సంవత్సరాల పాటు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే దీర్ఘకాలంలో భారీ బెనిఫిట్స్ సొంతమవుతాయని చెప్పవచ్చు.
ప్రతి మూడు నెలలకోసారి ఈ స్కీమ్ వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం సమీక్షిస్తుందని చెప్పవచ్చు. 18 సంవత్సరాలు నిండిన తర్వాత అత్యవసరం అనుకుంటే 50 శాతం మొత్తాన్ని విత్ డ్రా చేసుకునే అవకాశం ఉండటంతో ఈ స్కీమ్ ఎంతగానో ప్రయోజనం చేకూరుతుంది. రోజుకు 416 రూపాయల చొప్పున పొదుపు చేస్తే 21 సంవత్సరాల తర్వాత ఏకంగా 64 లక్షల రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుంది.
సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ ఆడపిల్లలకు వరం అని చెప్పవచ్చు. 22 లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే 40 లక్షల రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పొదుపు విషయంలో నిర్లక్ష్యంగా భావిస్తే మంచిదని చెప్పవచ్చు. ఆడపిల్లలకు ఉన్న ఇతర స్కీమ్స్ తో పోల్చి చూస్తే ఈ స్కీమ్ బెస్ట్ స్కీమ్ అవుతుంది.