ఎస్‌బీఐ సూపర్ స్కీమ్.. పెట్టిన పెట్టుబడికి రెట్టింపు డబ్బులు పొందే అవకాశం?

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు కొత్త స్కీమ్ లతో ఖాతాదారులకు మరింత దగ్గరవుతోంది. ఎస్బీఐకి సంబంధించిన ఒక స్కీమ్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేయడం ద్వారా రెట్టింపు మొత్తం పొందే అవకాశం అయితే ఉంది. స్టేట్ బ్యాంక్ ఉయ్ కేర్ డిపాజిట్ స్కీమ్ ను ఎస్బీఐ 2024 మార్చి 31 వరకు అమలు చేస్తుండటం గమనార్హం. ఈ స్కీమ్ లో వడ్డీరేటు 7.5 శాతంగా ఉండటం గమనార్హం.

ఎక్కువ మొత్తంలో వడ్డీ రేటు పొందాలని భావించే వీళ్లు ఈ స్కీమ్ ను ఎంచుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు టెన్యూర్‌తో డబ్బులు దాచుకోవాలని భావించే వాళ్లకు ఈ స్కీమ్ బెస్ట్ ఆప్షన్ అవుతుందని చెప్పవచ్చు. 8 నుంచి 9 సంవత్సరాల పాటు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే రెట్టింపు ఆదాయాన్ని పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. మధ్యలో డబ్బులు విత్‌డ్రా చేస్తే పెనాల్టీ పడుతుందని చెప్పవచ్చు.

అందువల్ల అవసరం లేని డబ్బును మాత్రమే ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది. రిస్క్ లేకుండా డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని భావించే వాళ్లు ఈ స్కీమ్ పై దృష్టి పెడితే మంచిది. సీనియర్ సిటిజన్స్ ఈ స్కీమ్ పై ఫోకస్ పెడితే కళ్లు చెదిరే స్థాయిలో ఆదాయం పొందే అవకాశం అయితే ఉంది. గరిష్టంగా రూ.2 కోట్ల వరకు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.

సేవింగ్స్ అకౌంట్ లో డబ్బులను ఎక్కువ కాలం డిపాజిట్ చేసినా ఎక్కువ వడ్డీని పొందే అవకాశం అయితే ఉండదు. సేవింగ్స్ అకౌంట్లపై బ్యాంకులు కేవలం 2 నుంచి 3 శాతం వడ్డీని మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. సమీపంలోని ఎస్బీఐ బ్రాంచ్ ద్వారా ఎస్బీఐ ఉయ్ కేర్ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది.