ఎల్ఐసీ సూపర్ పాలసీ.. రూ.1300 పొదుపుతో ఏకంగా రూ.40 లక్షలు పొందే ఛాన్స్!

దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్తగా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని భావించే వాళ్లకు ప్రయోజనం చేకూరేలా జీవన్ ఉమాంగ్ పాలసీని అందిస్తోంది. 55 ఏళ్లలోపు వయసు కలిగిన వాళ్లకు ఈ ఎండోమెంట్ ప్లాన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. లైఫ్ కవరేజ్‌తోపాటు మెచ్యూరిటీ సమయంలో పాలసీ డబ్బులు పొందే అవకాశం ఉండటంతో ఈ పాలసీ బెస్ట్ పాలసీ అవుతుంది.

30 ఏళ్ల వయసులో రూ.5 లక్షలకు బీమా తీసుకుంటే నెలకు 1300 రూపాయల ప్రీమియం చెల్లించాలి. ఈ విధంగా చెల్లిస్తే 60 ఏళ్ల తర్వాత ప్రతి సంవత్సరం ఏడాదికి రూ.40 వేలు వస్తాయి. 99 ఏళ్ల వరకు ప్రతి సంవత్సరం ఈ స్కీమ్ ద్వారా డబ్బులు పొందే అవకాశం ఉండగా 100వ సంవత్సరం తర్వాత బోనస్, ఎఫ్ఏబీ, బీమా మొత్తం 40 లక్షల రూపాయల వరకు పొందే అవకాశం అయితే ఉంటుంది.

ఈ పాలసీ ప్రస్తుతం ఉన్న పాలసీలలో బెస్ట్ పాలసీ కాగా ఈ పాలసీలో ఇన్వెస్ట్ చేస్తే మంచిదని చెప్పవచ్చు. ఈ పాలసీ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో బెనిఫిట్స్ ను పొందవచ్చు. సమీపంలోని ఎల్.ఐ.సీ బ్రాంచ్ ను సంప్రదించడం ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

పాలసీదారుడు మరణిస్తే నామినీ డబ్బులు పొందే అవకాశం ఉండటంతో ఆ విధంగా కూడా ఈ పాలసీ బెస్ట్ ఆప్షన్ అవుతుందని చెప్పవచ్చు. ఎల్.ఐ.సీ ప్రతి సంవత్సరం కొత్తకొత్త పాలసీలను అమలు చేస్తూ అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరేలా చేస్తుండటం గమనార్హం. దీర్ఘకాలంలో ఈ పాలసీలు భారీ స్థాయిలో బెనిఫిట్ ను అందిస్తాయి.