పోస్టాఫీస్ ద్వారా ప్రస్తుతం అమలవుతున్న ఇతర్ స్కీమ్స్ తో పోలిస్తే సుకన్య సమృద్ధి యోజన బెస్ట్ స్కీమ్ అని చెప్పవచ్చు. భవిష్యత్ అవసరాల కోసం ఎవరైతే ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తారో వాళ్లకు భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరనుంది. ఆడపిల్లల భవిష్యత్తు కోసం డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని భావించే వాళ్లకు ఈ స్కీమ్ బెస్ట్ ఆప్షన్ అవుతుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదని చెప్పవచ్చు.
ఆడ పిల్లల తల్లిదండ్రులకు ఆర్థిక భరోసా ఇచ్చే ఈ స్కీమ్ లో తక్కువ మొత్తం పెట్టుబడి పెట్టినా ఆడపిల్ల పదేళ్ల వయస్సు లోపు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఆడపిల్లల చదువులతో పాటు పెళ్లి అవసరాలకు ఉపయోగపడేలా కేంద్ర ప్రభుత్వం ఈ సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని అమలు చేస్తుండటం గమనార్హం. కనిష్టంగా 250 రూపాయల నుంచి గరిష్టంగా 1.5 లక్షల రూపాయల వరకు 15 ఏళ్ల పాటు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయాలి.
15 సంవత్సరాలు పెట్టుబడి పెట్టిన తర్వాత ఆరు సంవత్సరాల పాటు లాకిన్ పీరియడ్ ఉంటుంది. నెలకు 5,000 రూపాయల చొప్పున ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే బిడ్డకు 21 ఏళ్ళు వచ్చే నాటికి ఏకంగా 27 లక్షల రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలంలో పెట్టుబడి పెట్టాలని భావించే వాళ్లకు ఈ స్కీమ్ ను మించిన బెస్ట్ స్కీమ్ లేదు. ఇతర స్కీమ్స్ తో పోల్చి చూస్తే ఈ స్కీమ్ కు వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది.
8 శాతం చొప్పున చక్ర వడ్డీ ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే డబ్బులపై లభించే అవకాశాలు అయితే ఉంటాయి. 9 లక్షల రూపాయలు పెట్టుబడిగా పెడితే 17,93,814 రూపాయలు వడ్డీ రూపంలో లభిస్తుంది. ఇప్పటినుంచి ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడంపై దృష్టి పెడితే మంచిదని చెప్పవచ్చు.