కేంద్ర ప్రభుత్వం, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు రైతులకు మేలు చేసేలా ఇప్పటికే ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం కిసాన్, పీఎం కుసుమ్ పేర్లతో అమలు చేస్తున్న స్కీమ్స్ వల్ల రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. పీఎం కుసుమ్ యోజన స్కీమ్ ద్వారా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు సోలార్ పంపులను అమర్చడానికి రైతులకు సబ్సిడీని అందిస్తున్నాయి.
సోలార్ పంపుల ప్లాంట్లను ఏర్పాటు చెయ్యడం ద్వారా రైతులు పొలానికి నీరు అందించడంతో ఎక్కువ మొత్తంలో ఆదాయం సంపాదించవచ్చు. 4 నుంచి 5 ఎకరాల స్థలం ఉంటే 1 మెగావాట్ల సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి 15 లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. ఈ విద్యుత్ ను విక్రయించడం ద్వారా లాభాలను పొందవచ్చు. ఈ స్కీమ్ ద్వారా బంజరు భూములను కూడా పంట పొలాలుగా మార్చుకోవచ్చు.
http://saralharyana.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. 18001803333 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా కూడా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్ నంబర్, బ్యాంక్ పాస్‌బుక్ కాపీ, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో సమర్పించడం ద్వారా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రైతులకు ఈ స్కీమ్ బెస్ట్ స్కీమ్ అవుతుందని చెప్పవచ్చు.
సమీపంలోని వ్యవసాయ కేంద్రాలను సంప్రదించడం ద్వారా ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. రైతులకు ప్రయోజనం చేకూరేలా రాబోయే రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరిన్ని స్కీమ్స్ ను అమలు చేయనున్నాయని తెలుస్తోంది.