తల్లితండ్రులు చిన్నపిల్లల నిద్ర విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

సాధారణంగా చిన్నపిల్లలు ఎంత సమయం పాటు నిద్రపోతే అంత ఆరోగ్యానికి మంచిది అని భావిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే చిన్న పిల్లలు కూడా ఎక్కువ సమయం పాటు నిద్రపోతూ ఉంటారు.ఇలా పిల్లలు ఎక్కువ సమయం పాటు నిద్రపోవటం వల్ల తల్లిదండ్రులకు ఎన్నో సందేహాలు వస్తుంటాయి పిల్లలు ఇలా ఎక్కువ సేపు నిద్రపోవచ్చు నిద్రపోతే ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తుంటాయ అనే సందేహాలను వ్యక్తపరుస్తూ ఉంటారు.మరి చిన్నపిల్లల నిద్ర విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

చిన్నపిల్లల వైద్య నిపుణుల ప్రకారం పిల్లల వయస్సు ఆధారంగా నిద్రపోయే సమయాలు కూడా మారుతుంటాయి. దానికి అనుగుణంగా పిల్లలను విశ్రాంతి తీసుకోనిస్తే ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు..నిపుణుల సూచనల ప్రకారం పుట్టిన నెల రోజుల్లో చిన్నపిల్లలకు రోజుకు 15 నుంచి 16 గంటల నిద్ర అవసరం.అయితే చిన్నపిల్లలు మధ్య మధ్యలో పాల కోసం ఏడుస్తూ మేల్కొని పాలు తాగిన వెంటనే నిద్రపోతుంటారు. ఒకటి నుంచి నాలుగు నెలల వయసున్న చిన్నారులు రోజుకు 14 నుంచి 15 గంటల నిద్ర అవసరం. ఈ వయసు చిన్నారులు ఎక్కువగా నిద్రపోవడానికి ఆసక్తి కనబరుస్తారు.

నాలుగు నెలల నుండి సంవత్సరంలోపు చిన్నారులు 13 నుంచి 14 గంటల సమయం నిద్రపోతారు. ఈ వయసులోనే చిన్న పిల్లలు రోజులో సగభాగం మెలకువతో ఉండి సగభాగం నిద్రపోతారు కనుక రాత్రి, పగలు వాతావరణ పరిస్థితులకు అలవాటు పడతారు. ఒకటి నుండి మూడు సంవత్సరాల లోపు చిన్నారులు రోజుకు 12 గంటల నుండి 13 గంటల పాటు నిద్రపోతారు. ఈ వయసు చిన్నారుల్లో మానసిక శారీరక పెరుగుదల అభివృద్ధి వేగంగా జరుగుతుంది.ఇక 12 సంవత్సరాల లోపు పిల్లల వారికి 10 గంటల నిద్ర అవసరం ఇలాంటివారు మధ్యాహ్నం సమయంలో కూడా ఒక గంట పాటు విశ్రాంతి తీసుకోవడం వల్ల పిల్లల శారీరక ఎదుగుదలకు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. అయితే ప్రస్తుత కాలంలో నాలుగు సంవత్సరాల వయసుకే పిల్లలను స్కూలుకు పంపించడం వల్ల వారికి సరైన నిద్ర లేదని చెప్పాలి.