పీరియడ్ పెయిన్ ను తగ్గించే అద్భుతమైన ఆహారాలివే.. ఈ ఆహారాలతో ఆ సమస్యకు చెక్!

మహిళలను ఎక్కువగా వేధించే ఆరోగ్య సమస్యలలో పీరియడ్ పెయిన్ సమస్య ఒకటి. ఈ సమస్య చిన్న సమస్యలా అనిపించినా ఈ సమస్య వల్ల పడే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. పీరియడ్స్ సమయంలో చాలామంది మహిళలు చికాకుగా, అలసటగా, అసహనంగా ఫీల్ కావడం జరుగుతుంది. మరి కొందరు విపరీతమైన కడుపునొప్పి వల్ల ఎంతగానో ఇబ్బందులు పడతారు. ఈ నొప్పి వల్ల ఆ సమయంలో మహిళలు ఇంటి పని, ఆఫీస్ పని చేయడానికి సైతం ఇబ్బందులు పడతారు.

ఈ నొప్పిని తగ్గించుకోవడం కోసం కొంతమంది పెయిన్ కిల్లర్స్ పై ఆధార పడుతూ ఉంటారు. కొన్ని ఆహారాలను తీసుకోవడం ద్వారా ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు. పీరియడ్స్ సమయంలో కమలా పండ్లను ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది. ఈ పండ్లలో విటమిన్ సితో పాటు మెగ్నీషియం, పొటాషియం, విటమిన్‌ డి కూడా ఉంటాయి. యాంటీ ఇన్ఫ్లమేషన్‌ గుణాలను ఈ పండ్లు కలిగి ఉంటాయి.

యాంటీ-స్పాస్మోడిక్ గుణాలు ఉన్న దాల్చిన చెక్క వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. హై బ్లీడింగ్‌, వికారం, వాంతులు లాంటి సమస్యలకు దాల్చిన చెక్క చెక్ పెడుతుంది. హాట్‌ చాక్లెట్‌ తీసుకోవడం ద్వారా కూడా పీరియడ్ పెయిన్ సమస్య దూరమవుతుంది. నిమ్మరసం తాగడం వల్ల కూడా పీరియడ్ పెయిన్ కు చెక్ పెట్టవచ్చు. డ్రై ఫ్రూట్స్, నట్స్‌ తినడం వల్ల రక్త ప్రసరణను మెరుగుపడే అవకాశాలు ఉంటాయి.

ఆకు కూరలు ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కూడా ఈ సమస్యను దూరం చేయవచ్చు. పీరియడ్ పెయిన్ సమస్యతో బాధ పడేవాళ్లు ఈ విషయాలను గుర్తుంచుకుంటే మంచిది. ఈ చిట్కాలు పాటించినా సమస్య దూరం కాకపోతే వైద్యులను సంప్రదిస్తే మంచిదని చెప్పవచ్చు.