దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మధ్య కాలంలో కొత్త కొత్త స్కీమ్స్ ను అమలు చేస్తూ కస్టమర్ల సంఖ్యను మరింత పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది. దేశంలో ఎక్కువ సంఖ్యలో కస్టమర్లు ఉన్న బ్యాంక్ లలో ఎస్బీఐ ఒకటనే సంగతి తెలిసిందే. అయితే ఎస్బీఐ తాజాగా ఒక అద్భుతమైన స్కీమ్ ను ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ లో లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఏకంగా 8 లక్షల రూపాయలు పొందవచ్చు.
ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో మంచి బెనిఫిట్స్ ను పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎస్‌బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ స్కీమ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేసిన వాళ్లు అదిరిపోయే లాభాలను పొందే అవకాశం ఉంటుంది. గడిచిన పదేళ్లలో ఈ స్కీమ్ ఏకంగా 22 శాతం రాబడిని అందించడం గమనార్హం. పది సంవత్సరాల క్రితం ఈ స్కీమ్ లో లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసిన వాళ్లు ఇప్పుడు ఏకంగా 8 లక్షల రూపాయలు పొందే అవకాశం ఉంటుంది.
ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ ఫండ్స్ కూడా మంచి లాభాలను అందిస్తుండగా ప్రభుత్వ రంగ బ్యాంక్ లు అయితే సేఫ్ అని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలంలో మంచి లాభాలను సొంతం చేసుకోవాలని భావించే వాళ్లు ఈ స్కీమ్స్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే మంచిదని చెప్పవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ లో రిస్క్ కూడా ఎక్కువేననే సంగతి తెలిసిందే. కొన్నిసార్లు ఇన్వెస్ట్ చేసే డబ్బులు మొత్తాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది.
స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ మెంట్లకు అనుగుణంగా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్లు కూడా ఉంటాయని చెప్పవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలని భావించే వాళ్లు నిపుణుల సలహాల ఆధారంగా ఇన్వెస్ట్ చేస్తే మంచిదని చెప్పవచ్చు. ఫండ్ ఎంపిక విషయంలో అవగాహనను కలిగి ఉండి సరైన ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే దీర్ఘ కాలంలో భారీ మొత్తంలో పొందే అవకాశం ఉంటుంది.