ప్రస్తుత కాలంలో పురుషులు ఎదుర్కొన్నటువంటి అతిపెద్ద సమస్యలలో అంగస్తంభన సమస్య ఒకటి అధిక ఒత్తిడి ఆందోళన కారణంగా చాలామంది పురుషులు ఈ సమస్యతో బాధపడుతున్నారు అయితే ఇలా అంగస్తంభన సమస్య వెంటాడటం వల్ల చాలామంది పురుషులు డిప్రెషన్కు గురవుతూ తాము ఇక లైంగిక జీవితానికి పనికిరామనే భావనలో ఉంటారు అయితే ఇలాంటి సమయంలో భార్య మద్దతు భర్తకు ఎంతో అవసరమని నిపుణులు చెబుతున్నారు.
ఈ విధంగా భర్త అంగస్తంభన సమస్యతో బాధపడుతున్నారు అంటే భార్య వారికి మద్దతుగా నిలబడి మేమున్నామని భరోసా కల్పించాలి. వారిని చులకనగా మాట్లాడకుండా వారిని మానసికంగా శారీరకంగా దృఢంగా ఉంచడానికి ప్రయత్నం చేయాలి. అలాగే అంగస్తంభన సమస్యతో బాధపడుతూ ఉన్నట్లయితే వారిని నిపుణుల దగ్గరకు వెళ్లి సరైన ట్రీట్మెంట్ తీసుకునేలా ప్రోత్సహించాలి.అలాకాకుండా అంగస్తంభన సమస్యతో బాధపడుతున్న వారిని దూషించడం అవమానపరిచే విధంగా మాట్లాడటం వల్ల మరింత డిప్రెషన్ కి గురవుతారు.
ఇక లైంగిక జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే కలయిక మాత్రమే కాదని ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కూడా లైంగిక జీవితాన్ని సంతోషంగా అనుభవించవచ్చని తెలియజేయాలి. భార్య భర్తలు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉండాలంటే లైంగిక జీవితం ఒక్కటే ముఖ్యం కాదు ఇద్దరు ఒకరినొకరు హగ్ చేసుకోవడం ముద్దులు పెట్టుకోవడం మనసు మాట్లాడుకోవడం వంటివి కూడా ఇద్దరి మధ్య ప్రేమను పెంచుతాయి. అదేవిధంగా హస్తప్రయోగం వంటివి కూడా లైంగిక జీవితంలో సంతృప్తిని కలిగిస్తాయని చెప్పాలి.ఇలా అంగస్తంభన సమస్యతో బాధపడే వారికి ఇలా భార్యా మద్దతు కనుగా కల్పిస్తే తొందరగా వారు మానసిక శారీరక సమస్యల నుంచి బాధపడి అంగస్తంభన సమస్య నుంచి కూడా బయటపడే అవకాశాలు ఉంటాయి..