నిద్రపోయే సమయంలో ప్రతి ఒక్కరూ పాటించాల్సిన శయన నియమాలు ఇవే!

సాధారణంగా నిద్రపోయే సమయంలో ప్రతి ఒక్కరు కొన్ని నియమాలను పాటిస్తూ నిద్రపోవడం ఎంతో మంచిదని పండితులు చెబుతున్నారు. అది ఆరోగ్యపరంగాను ఐశ్వర్య పరంగాను శుభసూచికమని పండితులు తెలియజేస్తున్నారు. అందుకే నిద్రపోయేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ నియమాలను తప్పకుండా పాటించాలని పండితులు చెబుతున్నారు. మరి నిద్రపోయే సమయంలో పాటించాల్సిన ఆ నియమాలు ఏంటి అనే విషయానికి వస్తే…

నిద్రపోయేటప్పుడు నిర్మానుష్యంగా నిర్జన గృహంలో ఒంటరిగా ఎప్పుడు పండుకోకూడదు. అలాగే దేవాలయంలోనూ స్మశాన వాటికలో కూడా నిద్రపోకూడదు. ఒక వ్యక్తి నిద్రపోతున్నారు అంటే ఆ వ్యక్తిని అకస్మాత్తుగా నిద్ర నుంచి లేపకూడదు. అయితే విద్యార్థులు కానీ పనిచేసే వాళ్లు కానీ లేదా వాచ్మెన్ వంటి వారు ఎక్కువ సమయం నిద్రపోతే వారిని నిద్ర లేపచ్చుకానీ ఇతరత సమస్యలతో నిద్రపోయే వారిని పొరపాటున కూడా లేపకూడదు. ఇక మనకు సరైన ఆరోగ్యం ఆయుష్షు ఉండాలంటే తప్పనిసరిగా బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేవాలి.

పూర్తిగా చీకటి గదిలో నిద్రపోకూడదు నిద్రపోతున్న సమయంలో కాస్త వెళ్తూ ఉండేలా చర్యలు తీసుకోవాలి అలాగే తడి పాదాలతో ఎప్పుడూ కూడా నిద్రపోకూడదు.పొడి పాదాలతో పడుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అదేవిధంగా విరిగిపోయిన మంచం పై ఎప్పుడూ కూడా నిద్రపోకూడదు. నిద్రపోయే సమయంలో ఎవరు కూడా నగ్నంగా నిద్రపోకూడదు.అలాగే పగటిపూట ఎప్పుడు కూడా నిద్రపోకూడదు ఇలా నిద్రపోయే సమయంలో ఈ నియమాలు తప్పనిసరిగా పాటించాలి.