కొత్త సంవత్సరంలో మీకు మీరు ఇచ్చుకోవాల్సిన బహుమతులు ఇవే!

సాధారణంగా ఏదైనా ఒక పండుగ వస్తుంది అన్నా లేదా ఒక ఈవెంట్ జరుగుతుందని తెలిసినప్పుడు పెద్ద ఎత్తున ఇతరులకు బహుమతులు ఇవ్వడం సర్వసాధారణం.ఈ క్రమంలోనే నూతన సంవత్సరం రావడంతో ఎంతోమంది తమ స్నేహితులకు బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కానుకలు అందిస్తుంటారు.అయితే కొత్త సంవత్సరం రానున్న సందర్భంగా మీకు మీరు కానుకలు ఇచ్చుకోవాల్సి వస్తే ఎలాంటి కానుకలు తీసుకోవాలి అని విషయానికి వస్తే..

మీకు పుస్తకాలు గనక చదివే అలవాటు ఉంటే కొత్త సంవత్సరంలో మీకు మీరు పుస్తకాలను బహుమతిగా తీసుకోవడం ఎంతో మంచిది. ఈ నిర్ణయం మీ మనసుకు ఎంతో ప్రశాంతతను కలిగిస్తుంది. ఇక మీకు ప్రయాణాలు కనుక ఇష్టమైతే కొత్త ఏడాదిలో పలు ప్రదేశాలను ఒంటరిగా పర్యటించడానికి ప్లాన్ చేసుకోండి ప్రయాణం మనలో ఉన్నటువంటి ఒత్తిడిని దూరం చేస్తుంది.ఇక చాలామంది ఒంటరిగా తమ జీవితాన్ని గడపడానికి ఎంతో ఇష్టపడతారు ఇలా మీ ఒంటరి జీవితాన్ని మీకు నచ్చిన విధంగా గడపడం మంచిది.

నిత్యం ఇంటి పనులు ఆఫీస్ పనులు అంటూ చాలామంది వారికోసం సమయం కేటాయించు కోకుండా నిత్యం బిజీగా ఉంటారు. అయితే మీ కంటూ కొంత సమయం కేటాయించుకొని మీకు ఇష్టమైన విధంగా ఆ సమయాన్ని గడపడానికి ప్లాన్ చేసుకోండి.చాలామంది కుటుంబ బాధ్యతల గురించి పెద్ద ఎత్తున ఆందోళన చెందుతూ ఉంటారు. అయితే ఇలాంటి ఆందోళనలను కాస్త పక్కన పెట్టి మీ మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం వాకింగ్ వెళ్లడం పుస్తకాలు చదవడం వంటివి చేయటం వల్ల మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.