జుట్టు బాగా రాలుతోందా.. ఈ చిట్కాలు పాటిస్తే సులువుగా జుట్టు సమస్యలకు చెక్!

జుట్టు సమస్యలకు చెక్ పెట్టడానికి, తలకు మసాజ్ చేయడం, సహజ నూనెలతో మసాజ్ చేయడం, చింతపండు నీరు వాడటం, ఉల్లిపాయ నూనె వాడటం వంటివి ఉపయోగపడతాయి. తలకు మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది, ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. కొబ్బరి నూనె, ఆముదం, ఆలివ్ నూనె, ఉసిరి నూనె వంటి సహజ నూనెలతో మసాజ్ చేయండి.

చింతపండు నీరు తాగితే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, జింక్, ఐరన్ జుట్టును బలంగా మారుస్తాయి, దీంతో జుట్టు రాలడం తగ్గిపోతుంది. ఉల్లిపాయ నూనె జుట్టును మళ్ళీ బలంగా, మందంగా, అందంగా మారుస్తుంది. జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి సరైన ఆహారం తీసుకోవాలి. ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోండి. ఒత్తిడి జుట్టు రాలడానికి ఒక కారణం కావచ్చు. యోగా, ధ్యానం లాంటి పద్ధతుల ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.

బిగుతుగా ఉండే హెయిర్ స్టైల్స్ జుట్టు రాలడానికి కారణం కావచ్చు. కాబట్టి, తలకు నష్టం కలిగించకుండా, సరైన హెయిర్ స్టైల్స్ ఎంచుకోవాలి. పాలలో గసగసాలు కలిపి ఒక హెయిర్​ ప్యాక్​ తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు రాసి కొంత సమయం ఉంచండి. తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే చుండ్రు తొలగిపోతుంది. మందార పూలతో ఆవు మూత్రాన్ని కలిపి వాడటం వల్ల జుట్టు రాలటం తగ్గుతుంది.

వాతావరణంలో పెరుగుతున్న కాలుష్యం మన చర్మం, జుట్టు మీద తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ సమస్యలకు పరిష్కారం కోసం చాలా మంది వివిధ రకాల మందులు వాడుతుంటారు. ఫలితంగా.. వారిలో దుష్ప్రభావాల బారిన పడిన వారే ఎక్కువ. పాలకూర వెంట్రుకల మూలానికి ఆక్సిజన్ అందించగల, ఐరన్ పుష్కలంగా ఉండే పాలకూర జుట్టు తెల్లబడడాన్ని ఆపుతుంది.