మనలో చాలామంది తెలియకుండ చేసే కొన్ని తప్పుల వల్ల బరువు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. అయితే కొన్ని అలవాట్లు ఉంటే బరువు తగ్గాలని అనుకున్నా బరువు తగ్గే అవకాశం అయితే ఉండదు. రోజులో ఎక్కువ సమయం నిద్రిస్తే బరువు తగ్గే ఛాన్స్ తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ఎక్కువ సమయం నిద్రపోవడం వల్ల ఆరోగ్యానికి నష్టమే తప్ప లాభం అయితే ఉండదని చెప్పవచ్చు.
రోజుకు 8 గంటల నుంచి 9 గంటల పాటు నిద్ర పోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. రోజులో పది గంటలు నిద్రపోతే బాడీ మాస్ ఇండెక్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి. నిద్ర లేచిన వెంటనే సూర్యరశ్మి సోకితే శరీర జీవ గడియారం క్రమ పద్ధతిలో నడుచుకుంటుందని చెప్పవచ్చు. రాత్రి నిద్రపోయే ముందు ఉదయం నిద్ర లేచిన తర్వాత పరుపును సర్దుకునే అలవాటును కలిగి ఉండాలి.
రోజులో కొంత సమయం అయినా వ్యాయామం చేయాలి. వ్యాయామం చేయడం సాధ్యం కాకపోతే రోజూ మన పనులు మనమే చేసుకోవడం చేయాలి. వీలైనంత వరకు కొంతమేర దూరం ఉంటే కాలినడకన వెళ్తే మంచిది. మీ ఆహారంలో సంతృప్త కొవ్వు, కొలెస్ట్రాల్, ప్రాసెస్ చేసిన ఆహారాలు మరియు అధిక చక్కెరను పరిమితం చేస్తే మంచిది. తక్కువ కొవ్వు గల మాంసాలు, పౌల్ట్రీ మరియు చేపలను ఎంచుకోవాలి.
రోజువారీ ఆహారంలో పుష్కలంగా నీరు త్రాగడం వల్ల కేలరీల తీసుకోవడం తగ్గుతుంది మరియు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. వారంలో చాలా రోజులు కనీసం 30 నిమిషాల ఏరోబిక్ వ్యాయామం చేయాలి. వారానికి కనీసం రెండు సార్లు బల శిక్షణ వ్యాయామాలు చేయాలి. ప్రతి రాత్రి 7 – 8 గంటల నిద్ర చాలా ముఖ్యం. తగినంత నిద్ర లేకపోవడం వల్ల బరువు పెరగడానికి అవకాశం ఉంది. ఒత్తిడిని తగ్గించడానికి యోగా, ధ్యానం వంటి పద్ధతులను ఉపయోగించండి.