ఏపీఎస్ఆర్టీసీ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. అప్రెంటీస్ ట్రైనింగ్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ఏపీఎస్ఆర్టీసీ నుంచి ప్రకటన వెలువడింది. విజయనగరం జోన్ పరిధిలో శిక్షణ కోసం రిలీజైన ఈ నోటిఫికేషన్ వల్ల నిరుద్యోగులకు బెనిఫిట్ కలుగుతుంది. ఈ నెల 15వ తేదీ ఈ శిక్షణకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండగా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని తెలుస్తోంది. సంబంధిత ట్రేడ్ లలో ఐటీఐ పాసైన అభ్యర్థులు ఈ శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మార్కులు, ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరగనుందని సమాచారం అందుతోంది. https://www.apprenticeshipindia.gov.in/ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
వెరిఫికేషన్ సమయంలో ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో పాటు ఒక సెట్ జిరాక్స్ లను కూడా కలిగి ఉండాలి. అర్హత ఉన్నవాళ్లు రిజిస్ట్రేషన్ ఫారం, పదో తరగతి మార్క్స్ లిస్ట్, ఐటీఐ మార్క్స్ లిస్ట్, కుల ధృవీకరణ పత్రం, ఎన్.సీ.సీ సర్టిఫికెట్, ఆధార్ కార్డ్, పీ.హెచ్.సీ సర్టిఫికెట్, బయోడేటా ఫామ్, 25 రూపాయల స్టాంపులు అతికించిన కవర్ తీసుకుని హాజరు కావాల్సి ఉంటుంది.
ఈ శిక్షణకు సంబంధించి సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. గతంలో ఎంపికై అప్రెంటీస్ షిప్ కు దరఖాస్తు చేసుకున్న వాళ్లు అప్రెంటీస్ షిప్ కు మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం లేదు. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే దరఖాస్తు చేసుకుని శిక్షణ పూర్తి చేస్తే సులువుగా ఉద్యోగాలకు ఎంపికయ్యే అవకాశం ఉంటుంది.