ఈ మధ్య కాలంలో రైల్వే శాఖ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. దేశంలో ప్రభుత్వ ఉద్యోగం పొందాలని భావించే వాళ్లు రైల్వే ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తే సులువుగా లక్ష్యాన్ని సాధించే అవకాశాలు అయితే ఉంటాయి. అన్ని జోన్లలోని రైల్వే గ్రూప్ సి పోస్టులు ఏకంగా 2.4 లక్షలుగా ఉండటం గమనార్హం. దశల వారీగా ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది.
ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి అగ్నివీర్ అభ్యర్థులకు లెవల్ 1లో 10 శాతం, లెవెల్2 లో 5 శాతం రిజర్వేషన్లు ఉండనున్నాయని సమాచారం అందుతోంది. రాబోయే రోజుల్లో రైల్వే శాఖ నుంచి భారీ స్థాయిలో జాబ్ నోటిఫికేషన్లు రిలీజ్ కానున్నాయని సమాచారం అందుతోంది. దాదాపుగా రెండున్నర లక్షల ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ రిలీజ్ కానుందంటే నిరుద్యోగులకు భారీగా బెనిఫిట్ కలుగుతుంది.
ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి వేతనం కూడా భారీ లెవెల్ లో ఉండనుందని సమాచారం అందుతోంది. రైల్వే శాఖ పరీక్షలు ఇతర పరీక్షలతో పోల్చి చూస్తే ఒకింత సరళంగానే ఉండనున్నాయని సమాచారం అందుతోంది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. రైల్వే శాఖ ఉద్యోగ ఖాళీలకు భారీ సంఖ్యలో జాబ్ నోటిఫికేషన్లు రిలీజ్ కానున్నాయి.
రైల్వే శాఖ ఈ మధ్య కాలంలో 1,30,000కు పైగా ఉద్యోగ ఖాళీల భర్తీ దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. రైల్వే శాఖ ఇతర శాఖలతో పోల్చి చూస్తే ఎక్కువ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్న నేపథ్యంలో నిరుద్యోగులకు మరింత ఎక్కువగా బెనిఫిట్ కలగనుంది.