భారతీయ రైల్వే శాఖ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. దేశంలోని అన్ని రైల్వే జోన్లలో ఏకంగా 32000 ఉద్యోగ ఖాళీల భర్తీ దిశగా అడుగులు వేస్తోంది. లెవెల్ 1 ఉద్యోగ ఖాళీలకు సంబంధించి సంక్షిప్త ఉద్యోగ ప్రకటన తాజాగా విడుదలైంది. పాయింట్స్ మన్, అసిస్టెంట్, అసిస్టెంట్ లోకో షెడ్, అసిస్టెంట్ ఆపరేషన్స్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
మొత్తం 32000 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుండటంతో నిరుద్యోగులకు భారీ స్థాయిలొ ప్రయోజనం చేకూరనుంది. ట్రాఫిక్, ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. పదో తరగతి అర్హతతో పాటు సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు.
2025 సంవత్సరం జులై 1 నాటికి 18 నుంచి 36 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు అని చెప్పవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీహెచ్ అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపులు ఉండనున్నాయి. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 18000 రూపాయల వరకు వేతనం లభించనుంది. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 500 రూపాయలు కాగా మిగతా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 250 రూపాయలుగా ఉండనుంది.
జనవరి నెల 23వ తేదీన దరఖాస్తు ప్రక్రియ మొదలుకానుండగా ఫిబ్రవరి నెల 22వ తేదీన దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది. దేశంలో ఉన్న అన్ని రైల్వే జోన్లలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ఊహించని స్థాయిలో ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు.