రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు కేటగిరీల ఉద్యోగాలకు ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 1036 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఫిబ్రవరి నెల 6వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉన్నాయి. డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, ఎంబీఏ, టెట్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు.
2025 సంవత్సరం జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ 187, సైంటిఫిక్ సూపర్ వైజర్ 3, ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు 338, చీప్ లా అసిస్టెంట్ 54, పబ్లిక్ ప్రాసిక్యూటర్ 20, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్ స్ట్రక్టర్ 18, సైంటిఫిక్ అసిస్టెంట్ 2, జూనియర్ ట్రాన్స్ లేటర్ 130, సీనియర్ పబ్లిసిటీ ఇన్ స్పెక్టర్ 3, స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్ స్పెక్టర్ 59, మ్యూజిక్ టీచర్ 10, ప్రైమరీ రైల్వే టీచర్ 3, లైబ్రేరియన్ 188, అసిస్టెంట్ టీచర్ 2, ల్యాబొరేటరీ అసిస్టెంట్ 7, ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్3 – 12 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, ఎంబీఏ, టెట్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. 18 సంవత్సరాల వయస్సు నిండిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 500 రూపాయలు కాగా మిగతా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 250 రూపాయలుగా ఉండనుందని సమాచారం అందుతోంది.
ఆన్ లైన్ టెస్ట్, టీచింగ్ స్కిల్ టెస్ట్, ట్రాన్స్ లేషన్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ఊహించని స్థాయిలో ప్రయోజనం చేకూరుతుంది.